మాస్ మహారాజా రవితేజ ఈగల్ జనవరి 13 విడుదలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటోంది. పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో వాయిదా పడి రిపబ్లిక్ డేకి వెళ్లొచ్చనే వార్తలు నెల రోజులుగా వస్తూనే ఉన్నాయి కానీ నిర్మాతలు మాత్రం వాటిని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. నిజానికి ఈగల్ రెండు వైపులా ఒత్తిడి వ్యూహంలో ఇరుక్కుంటోంది. గుంటూరు కారంని ఢీ కొట్టడం అంత సులభం కాదు. దీని తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ ఒకవేళ టాక్ బాగుంటే హనుమాన్ వైపు వెళ్తుంది. మాస్ ని నేను లాగుతానంటూ నాగార్జున నా సామిరంగాని ఆఘమేఘాల మీద సిద్ధం చేయిస్తున్నారు.
ఇక వెంకటేష్ సైంధవ్ ఎంచక్కా ప్రమోషన్లు చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో ఉంది. గణేష్ రేంజ్ మాస్ ఇందులో ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఎటొచ్చి ఈగల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఒక డిఫరెంట్ స్టైల్ లో యాక్షన్ డ్రామాగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీశారని ఇన్ సైడ్ టాక్. అలాంటప్పుడు ఈ జానర్ పండగ బరికి సూట్ కాదు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రమే రాజీ పడే ప్రసక్తే లేదని డౌటొచ్చి అడిగిన బయ్యర్లతో అన్నట్టు సమాచారం. ఒకవేళ నిజంగా జనవరి 26కి వెళదాం అనుకున్నా అక్కడ కూడా రిస్క్ పొంచి ఉంది.
హృతిక్ రోషన్ ఫైటర్, విక్రమ్ తంగలాన్, మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ లు ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తెలుగు మార్కెట్ వరకు వీటితో రవితేజకు ఇబ్బంది లేదు కానీ బయట రాష్ట్రాల్లో సమస్యలొస్తాయి. కాకపోతే సంక్రాంతి కంటే బెటర్ ఆప్షన్ అవ్వొచ్చనే కామెంట్స్ ని కొట్టిపారేయలేం. లేదూ ఇవన్నీ ఎందుకు జనవరి 13కే దొరికినన్ని స్క్రీన్లే చాలు అనుకుంటే ఈగల్ కంటెంట్ ఎంత బాగున్నా సరే ఓపెనింగ్స్, కలెక్షన్లు రెండింటిలోనూ కాస్త తగ్గుదలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇంకో రెండు మూడు వారాల దాకా పండగ చిత్రాల విడుదల సస్పెన్సులు కొనసాగేలానే ఉంది.
This post was last modified on December 11, 2023 9:34 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…