కొన్ని నెలల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ప్రకటించినప్పుడు ఒకరకమైన అనుమానం తలెత్తింది. సందీప్ తీసిన అర్జున్ రెడ్డి ఎంత క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయినా అందులో నటించింది కమర్షియల్ హీరో కాదు. పైగా ఫైట్లు గట్రా లేని ఒక బోల్డ్ లవ్ స్టోరీ కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ కి యూత్ ఫిదా అయిపోయి బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు. అలాంటి డైరెక్టర్ కి ఎస్ చెప్పడం రిస్క్ అవుతుందేమోననే సందేహాలు లేకపోలేదు. పుష్ప ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆ ఇమేజ్ ని కాపాడుకునేందుకు బన్నీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడో చూస్తున్నాం.
నిన్న యానిమల్ రివ్యూ పెట్టిన అల్లు అర్జున్ అన్ని డౌట్లు తీర్చేశాడు. పేరు పేరునా సినిమాలో నటించినవాళ్ల గురించి, టెక్నికల్ టీమ్ గురించి ఇంత సుదీర్ఘంగా రివ్యూ చేసిన స్టార్ హీరో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. బన్నీ ప్రతి మాటలో తాను సందీప్ వంగా కథ వినకుండానే ఎస్ చెప్పడం ఎంత గొప్ప నిర్ణయమో తెలియజేయడం అంతర్లీనంగా కనిపించింది. దీని కన్నా ముందు ప్రభాస్ స్పిరిట్ ఉంది. దానికో రెండేళ్లు పడుతుంది. ఈలోగా బన్నీ పుష్ప 2 పూర్తి చేసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలుపెట్టొచ్చు. ఇదంతా కుదురుకునే లోపు సందీప్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడు.
ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్న సందీప్ వంగా అల్లు అర్జున్ ని ఏ పాత్రలో ప్రెజెంట్ చేస్తాడనేది సస్పెన్సే. ఇదంతా చాలా టైం పట్టే వ్యవహారం. పుష్ప 2 షూటింగ్ కు వద్దనుకుంటున్నా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. కొన్ని వారాలుగా నిర్విరామంగా జరుగుతుంటే కీలక పాత్ర పోషిస్తున్న జగదీశ్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ త్వరగా వస్తే టెన్షన్ తీరిపోతుంది. లేదంటే అతను లేని భాగాలు ముందు పూర్తి చేసేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఆగస్ట్ లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడం కష్టం.
This post was last modified on December 9, 2023 12:11 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…