ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొన్న ఓటిటి రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు అడుగులు వేస్తున్న ఈటీవీ విన్ ఇటీవలే మంచు మనోజ్ తో ఉస్తాద్ అనే సెలబ్రిటీ గేమ్ షోని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి దీని విశేషాలను ఇటీవలే పంచుకున్న ఈ హీరో సినిమాల కన్నా ముందు ఈ షో తనకు కంబ్యాక్ గా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాడు. దానికి తగ్గట్టే ఫస్ట్ సిరీస్ అతిధులుగా న్యాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ, అడవి శేష్ లాంటి క్రేజీ సెలబ్రిటీలను తీసుకొచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీనికి మంచి బడ్జెట్ కేటాయిస్తోంది.
ఆడియన్స్ కి దగ్గరవ్వడానికి మనోజ్ కిది మంచి ఛాన్స్. గతంలో అక్కయ్య మంచు లక్ష్మిప్రసన్న ఇలాంటి కార్యక్రమమే చేసి సక్సెస్ అయ్యింది. మేము సైతం లాంటి ఛారిటీ షోని విజయవంతంగా నడిపించింది. ఇప్పుడు మనోజ్ సీన్ లోకి వచ్చాడు. అయితే ఇది ఊరికే ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుని పంపించే ఇంటర్వ్యూ కాదు. గేమ్స్ ఆడిస్తారు. గెలిచిన సొమ్ములతో అవసరంలో ఉన్న అభిమానులకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇలా కొత్త ఫార్మాట్ లో డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు. మనోజ్ ఈ ప్రోగ్రాం ఒప్పుకోవడం వెనుక తెలివైన ప్లానింగ్ కనిపిస్తోంది.
మనోజ్ త్వరలో రెండు సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వాటిలో మొదటిది వాట్ ది ఫిష్. గ్యాప్ వచ్చేయడంతో వీటికి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. గ్రౌండ్ లెవల్ లో మనోజ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ అది కలెక్షన్లుగా మారాలంటే ముందు తను జనాలకు బాగా దగ్గరవ్వాలి. ఇదే ఈటీవీ విన్ తో పీపుల్స్ మీడియా వెన్నెల కిషోర్ తో ఓ టాక్ షో చేయించింది. అంతగా వర్కౌట్ కాలేదు. దానికి సతీసమేతంగా గెస్టుగా వచ్చినప్పుడే మనోజ్ తో గేమ్ షో ప్రతిపాదన తేవడం, తను ఒప్పేసుకోవడం జరిగిపోయాయి. ఉస్తాద్ కనక సక్సెస్ అయితే ఈటీవీ విన్ కి మంచి బూస్ట్ వచ్చినట్టే.
This post was last modified on December 8, 2023 10:01 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…