యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. గత కొన్ని నెలల్లో రెండు భారీ ప్రాజెక్టులను ప్రభాస్ అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ నిర్మించబోయే చిత్రం. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
దీనికి దీపికా పదుకొనే లాంటి అగ్ర బాలీవుడ్ హీరోయిన్ కథానాయికగా ఖరారైంది. ఇటీవలే దీన్ని మించిన భారీ చిత్రం ఒకటి అనౌన్స్ అయింది ప్రభాస్ హీరోగా. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి అతను ‘ఆదిపురుష్’ అనే రామాయణ నేపథ్య సినిమా చేయబోతున్నాడు. దీని బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లంటున్నారు. ‘సాహో’ లాంటి నిరాశాజనక సినిమా చేసి.. ఆపై ‘రాధేశ్యామ్’ లాంటి కాస్త హైప్ తక్కువున్న మూవీ చేస్తున్న ప్రభాస్.. ఆ తర్వాతి రెండు ప్రాజెక్టుల విషయంలో మాత్రం సరిగ్గానే ప్లాన్ చేసినట్లున్నాడు.
ఈ అనౌన్స్‌మెంట్లతోనే ప్రభాస్ అభిమానుల ఆనందం పట్టలేకుండా ఉంది. ఐతే ఇప్పుడు ప్రభాస్.. ఇంకో అనౌన్స్‌మెంట్‌కు రెడీ అవుతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో అతను పని చేయబోతున్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ సినిమా ప్రభాస్‌తోనే అన్నారు. కానీ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా లైన్లోకి వచ్చింది. ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అయితే ఆ దిశగా సంకేతాలైతే ఇచ్చింది.
కానీ దాని గురించి పూర్తిగా వెల్లడి కాకముందే ప్రభాస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడని గట్టిగా ప్రచారం జరుగుతోందిప్పుడు. ప్రభాస్ నుంచి ఇంకో సర్ప్రైజ్.. అతి త్వరలో అనౌన్స్‌మెంట్ అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. నిజంగా తారక్ సినిమా కంటే ముందు దీని గురించి అధికారిక ప్రకటన వస్తే మాత్రం జూనియర్ అభిమానులు తట్టుకోవడం కష్టమే. ఐతే ప్రభాస్‌కు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే తారక్ సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ ఈ చిత్రం చేసే అవకాశముంది.
This post was last modified on September 1, 2020 11:47 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…