‘అజ్ఞాతవాసి’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ అభిమానులకు రెండేళ్లు చాలా భారంగా గడిచాయి. పవన్ రెండేళ్ల పాటు రాజకీయాలకే అంకితం అయిపోవడంతో ఒక్క సినిమా అప్ డేట్ లేదు. వేరే హీరోల అభిమానుల పుట్టిన రోజులకు సినీ విశేషాలతో సంబరాలు సాగుతుంటే.. పవన్ ఫ్యాన్స్‌కు అదేమీ లేక తెగ ఇబ్బంది పడిపోయారు.
కానీ వాళ్లను ఇంకెంతో కాలం నిరాశలో ఉంచకుండా గత ఏడాది చివర్లో రీఎంట్రీ సినిమాను మొదలుపెట్టేశాడు పవన్. ఒకటికి రెండు సినిమాలు చేస్తూ, ఇంకో సినిమాను ఓకే చేయడంతో మొత్తం మూడు సినిమాలు లైన్లోకి వచ్చేశాయి. ఇంతలో పవన్ పుట్టిన రోజు వచ్చేసింది.
గత రెండేళ్లు అనావృష్టితో ఉన్న వాళ్లకు.. ఇప్పుడు అతివృష్టి అన్నట్లుగా తయారైంది. మొన్న చిరంజీవి పుట్టిన రోజుకు ఎంతో ఆశిస్తే ఆల్రెడీ ఖరారైన ‘ఆచార్య’ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఒక మోషన్ పోస్టర్‌తో సరిపెట్టారు. మరే కొత్త సినిమాల అప్ డేట్స్ ఇవ్వలేదు.
కానీ ఇలా పుట్టిన రోజుకు అభిమానులకు కానుకలు ఇవ్వాలి.. వాళ్లను ఖుషీ చేయాలి అని పవన్ ఆలోచించే రకం కాదు కానీ.. ఆయన పుట్టిన రోజు నాడు సందడి మామూలుగా ఉండేలా లేదు. ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’తో పాటు నటించబోయే హరీష్ శంకర్ సినిమా అప్‌డేట్లు రెడీ అయిపోయాయి. హరీష్-పవన్ సినిమా గురించి రేపు సాయంత్రం 4.05 గంటలకు అప్ డేట్ ఇవ్వనున్నారు. అది టైటిల్ ప్రకటనగా భావిస్తున్నారు.
ఇక ఆల్రెడీ ‘వకీల్ సాబ్’ మోషన్ టీజర్ వస్తుందన్న సంకేతాలు రాగా.. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఉదయం 9.09 గంటలకు ఈ విశేషం బయటికి రానుంది. ఇక క్రిష్ సినిమాకు సంబంధించి కూడా ఏదైనా విశేషాన్ని పంచుకుంటే పవన్ అభిమానుల సంబరాలకు అంతే ఉండదు. మరోవైపు ట్విట్టర్లో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్రెండ్‌తోనే రికార్డు కొట్టిన పవన్ అభిమానులు.. ఇప్పుడు పుట్టిన రోజుకు 100 మిలియన్ టార్గెట్‌తో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ట్రెండ్ మొదలుపెడుతుండటం విశేషం.
This post was last modified on September 1, 2020 5:11 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…