లీకైనట్టే కళ్యాణ్ రామ్ డెవిల్ విడుదల తేదీని లాక్ చేసుకుంది. డిసెంబర్ 29 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత ప్రకటించారు. అంటే సరిగ్గా ఇంకో ఇరవై రెండు రోజులన్న మాట. నిజానికి సలార్, డంకీలు వచ్చిన వారానికే ఈ రిస్క్ చేయడం పట్ల పలు అనుమానాలు తలెత్తాయి కానీ జనవరి నుంచి మార్చి దాకా సరైన డేట్లు ఖాళీ లేకపోవడం చూస్తే డెవిల్ తీసుకున్న నిర్ణయం సబబేనని చెప్పాలి. లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ స్పై డ్రామాకు నిర్మాత అభిషేక్ అగర్వాలే దర్శకత్వం వహించారు.
నిజానికి దీని మొదటి డైరెక్టర్ నవీన్ మేడారం గురించిన క్లారిటీ ఇప్పటికీ సరైన రీతిలో బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో డెవిల్ ప్రమోషన్ల కోసం టీమ్ ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తుంది. అప్పుడు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో బహుశా అభిషేక్ నామా ముందుగానే ప్రిపేరయ్యుంటారు. కళ్యాణ్ రామ్ నెలల తరబడి బయట కనిపించడం లేదు. చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడంతో మొదలుపెట్టి బెయిలు మీద బయటికి రావడం దాకా ఎక్కడా స్పందించలేదు. సరే ఇది రాజకీయ కోణమనుకున్నా కనీసం ఏదైనా ఇతర సినిమా ఈవెంట్లకు హాజరైన దాఖలాలు లేవు.
ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ దొరకలేదు. డెవిల్ భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇటీవలే యానిమల్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ బ్రాండ్ ఈసారి పబ్లిసిటీకి ఉపయోగపడనుంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. 29న బబుల్ గమ్ తప్ప పెద్దగా చెప్పుకునే పోటీ ఏదీ లేదు. ఆపై సంక్రాంతి దాకా ఎంతలేదన్నా 13 రోజుల టైం దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కళ్యాణ్ రామ్ కి అంత టైం చాలు. పాజిటివ్ టాక్ వస్తే రికవరీ జరిగిపోతుంది. బిజినెస్ ఎంతకు క్లోజ్ చేస్తారనేది చూడాలి.
This post was last modified on December 7, 2023 6:37 pm
ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి…
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ…
ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…
శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై తన గ్లామర్ తో కుర్ర కారు…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…