ఇటీవలే నాగచైతన్య దూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. యానిమల్ ఊపులో ఉండి ఇంకా చాలా మంది పట్టించుకోలేదు కానీ తెలుగు డిజిటల్ స్పేస్ లో వచ్చిన బెస్ట్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ గా దీనికి ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. అయితే షూటింగ్ ఎప్పుడో పూర్తయినా స్ట్రీమింగ్ రిలీజ్ చేయడానికి చాలా టైం తీసుకున్న ప్రైమ్ సరైన సమయంలో చేయలేదనే కంప్లైంట్ అభిమానుల నుంచి వచ్చింది. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద పెద్దగా హడావిడి లేని టైంలో వచ్చి ఉంటే ఓటిటిలో మంచి ఫలితం దక్కేదన్న కామెంట్స్ లో ముమ్మాటికీ నిజముంది.
చైతుదే కాదు సమంతా వెబ్ సిరీస్ కు సైతం ఇలాంటి వెయిటింగ్ తప్పేలా లేదు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకేలు రూపొందించిన సిటాడెల్ కోసం ఫ్యాన్స్ నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ నిరీక్షణ ఇంకా పొడిగించేలా ఉన్నారు. ఓటిటి వర్గాల కథనం ప్రకారం సిటాడెల్ ని 2024 వేసవిలో ప్రేక్షకుల ముందు తీసుకురావాలని నిర్ణయించారట. సామ్ సరసన ఇందులో వరుణ్ ధావన్ నటించాడు. ఇండియాతో పాటు మెక్సికో, ఇటలీ లాంటి దేశాల్లో వందల కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించారు. ఇంత లేట్ ఎందుకనే కారణాలు లేకపోలేదు.
ప్రియాంకా చోప్రా నటించిన సిటిడెల్ ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకున్న ప్రైమ్ ఇప్పుడీ దేశీ రీమేక్ ని రీ షూట్ చేయకపోయినా ఎడిటింగ్ తో పాటు విఎఫెక్స్ కి సంబంధించి కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించిందట. రాజ్ అండ్ డికెల మరో సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఫర్జీకి మంచి స్పందనే వచ్చినా బ్లాక్ బస్టర్ రేంజ్ అనిపించుకోలేదు. అందుకే సిటాడెల్ విషయంలో ఒకటికి పది జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
This post was last modified on December 6, 2023 3:51 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…