ఒకపక్క రేపు ఎల్లుండి టాలీవుడ్ లో కొత్త సినిమాల రిలీజులున్నాయి. ఇంకో వైపు చెన్నైలో మొదలైన వర్షాల తాకిడి క్రమంగా తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తోంది. నిన్న నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా ఇవాళ మిగిలిన చోట్ల మబ్బులు ముసురుకుని జల్లులు మొదలయ్యాయి. దీంతో సహజంగానే అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా కనిపిస్తున్నాయి. హాయ్ నాన్న ఫ్యామిలీ మూవీ కావడంతో టాక్ అందుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నితిన్ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఎక్స్ ట్రాడినరి టికెట్ సేల్స్ కూడా ఆర్డినరిగానే కనిపిస్తున్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించేదే.
మాములుగా వర్షాలు ఉన్నప్పుడు ప్రేక్షకులు అదే పనిగా థియేటర్లకు రావడం కష్టం. కోస్తా, ఉత్తరాంధ్రలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. నాని, నితిన్ ఇద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 55 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. వీలైనంత త్వరగా వర్షాలు తెమలకపోతే విలువైన వీకెండ్ వృథా అయ్యే ప్రమాదం ఉంది. ఇద్దరు హీరోలు ఫలితం మీద చాలా ధీమాగా ఉన్నారు. ఒకటి రెండు షోలు అయ్యాక టికెట్లు దొరకవనే రేంజ్ లో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఇది జరగడం మంచిదే. హాళ్లు జనాలతో కిటకిటలాడతాయి.
తెలంగాణలోనూ వాతావరణం పొడిగా ఉండటం ఏ మేరకు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి. ఫుల్ జోష్ మీదున్న యానిమల్ సైతం ఈ కారణం వల్లే నిన్నటి నుంచి నెమ్మదించింది. ఇంకా చూడని జనాలు బోలెడున్నారు. స్క్రీన్ మీదే ఎక్స్ పీరియన్స్ చేయాలనే టాక్ బలంగా వెళ్లడంతో ఓ వారమయ్యాక చూద్దామని ఆగిన వాళ్లున్నారు. ఈ బ్యాచ్ ని హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ వైపు లాగాలంటే చూసినవాళ్ల అభిప్రాయాలు కీలకం కాబోతున్నాయి. ప్రమోషన్ల కోసం విపరీతంగా కష్టపడిన నాని, నితిన్ లకు ఈ వర్షాలు స్పీడ్ బ్రేకర్ లా మారాయి. రేపటికి తెరిపినిస్తే సంతోషమే.
This post was last modified on December 6, 2023 3:46 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…