సాయిపల్లవి ఎన్ని మంచి పాత్రలు, సినిమాలు చేసినా ఫిదాలో హైబ్రిడ్ పిల్ల భానుమతిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎప్పటికీ స్పెషల్ గా ఉండిపోతుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కేవలం కథ నచ్చితే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఈ కేరళ కుట్టి ఇటీవలే నాగ చైతన్య తండేల్ కు ఎస్ చెప్పింది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కానీ హీరోయిన్ అయినప్పటికీ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రే డిజైన్ చేశాడట దర్శకుడు చందూ మొండేటి. ఇప్పుడిది కాకుండా కెజిఎఫ్ యష్ ఉరఫ్ రాఖీ భాయ్ చేయబోయే 19వ ప్యాన్ ఇండియా మూవీకి సాయిపల్లవినే ఎంచుకున్నట్టు బెంగళూరు టాక్.
ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎనిమిదో తేదీ ఫస్ట్ లుక్ తో వదలబోయే టైటిల్ లాంచ్ లో ఏమైనా చెబుతారేమో చూడాలి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో గోవా మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఇది రూపొందుతుందని ఆల్రెడీ లీక్ ఉంది. కెజిఎఫ్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న యష్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసమే నెలల తరబడి ఎదురు చూసి మరీ షూటింగ్ కి ఎస్ అన్నాడు. ప్రశాంత్ నీల్ తర్వాత ఎవరికి అవకాశం ఇస్తాడోనని ఎదురు చూసినవాళ్లకు లేడీ డైరెక్టర్ ని ఎంచుకోవడం ద్వారా స్వీట్ షాక్ ఇచ్చాడు. 2025 విడుదల టార్గెట్ గా దీని చిత్రీకరణ దేశవిదేశాల్లో జరగబోతోంది.
ఇక సాయిపల్లవి విషయానికీ వస్తే యష్ 19 పడితే శాండల్ వుడ్ లోనూ మంచి గుర్తింపు వస్తుంది. బాలీవుడ్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్న రామాయణంలో రాముడు రన్బీర్ కపూర్ సరసన సీతగా ఈమే ఎంపికయ్యిందనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది కానీ ఆ ప్రాజెక్ట్ తాలూకు వివరాలు బయటికి రాలేదు. అందులో రావణుడిగా యష్ నే అడిగారని టాక్ కూడా ఉంది. కన్ఫర్మ్ అయితే తప్ప ఈ ఏదీ ఖరారుగా చెప్పలేం. మలయాళంలోనూ ఏమంత దూకుడుగా లేని సాయిపల్లవి ఎన్ని భాషల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా రాజీపడని తన మనస్తత్వాన్ని మాత్రం మార్చుకునే సమస్యే లేదంటోంది.
This post was last modified on December 5, 2023 5:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…