బాహుబలి తర్వాత అసాధారణంగా పెరిగిపోయిన ప్రభాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే సినిమాలు చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ప్రభాస్ సినిమా అంటే అన్ని భారీగా ఉండాలని ఆలోచనతో.. టెక్నీషియన్లను, ముఖ్యంగా సంగీత దర్శకులను ఖరారు చేయడం ఒక సమస్యగా మారిపోయింది. సాహో సినిమాకు సంగీత దర్శకుడిని ఖరారు చేయడంలో ఎంత తాత్సారం చేశారో తెలిసిందే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరితో.. పాటలు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లతో చేయించుకున్నారు.
రాధేశ్యామ్ విషయంలో కూడా ఎంతో జాప్యం జరిగింది. చివరికి జస్టిన్ ప్రభాకరన్ తో పని కానిచ్చారు. కల్కి సినిమాకు ముందు మిక్కీ మేయర్ ను అనుకొని తర్వాత.. నారాయణన్ ను ఎంచుకోవడం తెలిసిందే.
ఇప్పుడిక ప్రభాస్ కొత్త సినిమా సంగీత దర్శకుడి విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి.. ప్రభాస్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ను హను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. విశాల్ మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడు అనడంలో సందేహం లేదు. ప్రభాస్ తో సినిమా తీసే నిర్మాతల ఆలోచన వేరుగా ఉంటోంది. చిన్న, మిడ్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ప్రభాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే సంగీతం ఇవ్వలేరన్న ఒక భ్రమలో ఉంటున్నారు.
తనకెంతో నచ్చిన మిక్కిని నాగ్ అశ్విన్ కల్కి కోసం పక్కన పెట్టడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ నేపథ్యంలో విశాల్ అయినా హను సినిమాకు కొనసాగుతాడా లేదంటే చివర్లో మళ్ళీ మార్పు జరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. హను దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ, సీతారామం చిత్రాలకు విశాల్ అద్భుతమైన సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అవి మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యాయి.
This post was last modified on December 5, 2023 5:18 pm
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్‌లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…