దర్శకులకు మ్యూజిక్ టేస్ట్ చాలా అవసరం. అలా అని కేవలం కొత్త తరహా సంగీతం మీద మాత్రమే పట్టుంటే సరిపోదు. ఒకప్పటి క్లాసిక్స్ మీద అవగాహన ఉండాలి. కథ ప్రకారం వాటిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ప్లే చేసుకోవాలి. కొన్ని బ్లాక్ బస్టర్స్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ‘లియో’లో హీరో విజయ్ కేఫ్ లో జరిగే ఫైట్ వెనుక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బదులు లోకేష్ కనగరాజ్ ఎప్పుడో వచ్చిన ఇళయరాజా, దేవా సాంగ్స్ ప్లే చేసి అద్భుతమైన ఫీల్ తీసుకొచ్చాడు. అసలు రక్తం చిందే సీన్లో చెవులకు ఇంపనిపించే సాహిత్యం వినిపించడం చాలా విచిత్రమైన ప్రయోగం.
లేటెస్ట్ సెన్సేషన్ ‘యానిమల్’లో సందీప్ వంగా దీన్ని ఇంకా గొప్పగా బయట పెట్టుకున్నాడు. యంగ్ రన్బీర్ కపూర్ పరిచయాన్ని ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో వచ్చిన రోజా సాంగ్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం గొప్పగా పేలింది. బాబీ డియోల్ ఇంట్రోలో పదేళ్ల నుంచి యూట్యూబ్ లో ఉన్న అరబిక్ పాటను వాడుకోవడం ఎంత వైరల్ చేసిందో చెప్పడం కష్టం. ‘భగవంత్ కేసరి’లో బస్సులో ప్రయాణిస్తూ బాలకృష్ణ పాత ఎన్టీఆర్ పాటను హం చేస్తూ రౌడీలను చితకొట్టే ఐడియా అనిల్ రావిపూడి తెలివి నుంచి పుట్టుకొచ్చిందే. కమల్ హాసన్ ‘విక్రమ్’లోనూ 1986నాటి ఒరిజినల్ ట్రాక్ వాడారు.
వీళ్లంతా యంగ్ ఫిలిం మేకర్స్. పదుల సంఖ్యలో సినిమాలు తీసిన అనుభవం కూడా లేదు. అయినా సరే రికార్డులు బద్దలయ్యే విజయాలు సొంతం చేసుకున్నారు. క్లాసిక్ సాంగ్స్ పట్ల ఉన్న ఆరాధనా భావం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. ఇలా చేయడం మొదటిసారేం కాదు కానీ జనం ఆమోదించేలా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా సింక్ చేయడంలోనే డైరెక్టర్ ప్రతిభ దాగి ఉంటుంది. ఇప్పటి కాలంలో ఉండటం ఎంత ముఖ్యమో టైం మెషీన్ లో అలా వెనక్కు వెళ్లి ఒకనాటి లెజెండరీ సంగీతాన్ని తవ్వి తీసి 4జి ఆడియన్స్ కి అనుగుణంగా ఉపయోగించుకోవడమూ అంతే కీలకం.
This post was last modified on December 4, 2023 5:04 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…