గత నెలలో వచ్చిన మ్యాడ్ అనే చిన్న సినిమాకు ఒక వెరైటీ ఆఫర్ ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ. జాతిరత్నాలు మూవీలో కంటే మ్యాడ్ మూవీకి తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని అతను సవాల్ చేశాడు. అయితే మ్యాడ్ మూవీలో కామెడీ బాగానే ఉండడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా కంప్లైంట్స్ లేకపోయాయి. లేదంటే నాగ వంశీ మాటలు పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయేవేమో. ఇప్పుడు మరో ఫిలిం సెలబ్రిటీ తన సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఇలాంటి ఛాలెంజే చేశాడు. అతను ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. మ్యాడ్ సినిమాను గుర్తుచేస్తూ అతనీ ఛాలెంజ్ చేయడం విశేషం.
తన కొత్త చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రెస్ మీట్లో నితిన్ మాట్లాడుతూ.. మ్యాడ్ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని నిర్మాత నాగ వంశీ అన్నాడని.. తాను కూడా ఎక్స్ట్రా విషయంలో అలాంటి సవాలే చేస్తున్నానని.. ఈ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు నాగ వంశీనే వాపస్ ఇస్తాడని.. ఆయనకి తనకు చాలా లావాదేవీలు ఉన్నాయని నితిన్ నవ్వుతూ అన్నాడు. కాగా ఈ వీడియోకు సంబంధించిన ట్వీట్ మీద నాగ వంశీ స్పందిస్తూ.. ఆ రోజేదో మ్యాడ్ సినిమా వైబ్ లో అలా అన్నానని.. తనను లాక్ చేస్తే ఎలా అని ఒక కామెడీ ఇమేజ్ తో రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
మరి ‘నవ్వకుంటే టికెట్ డబ్బులు వాపస్’ సెంటిమెంట్ మరోసారి పనిచేసే మ్యాడ్ లాగే ఎక్స్ట్రా కూడా మంచి హిట్ అవుతుందేమో చూడాలి. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకులకు ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 2, 2023 11:55 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…