యానిమల్ సినిమా కొందరికి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. కొందరు దాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరు ఓకే అంటున్నారు. ఆ చిత్రం అయితే టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా మారిపోయింది అన్నది మాత్రం వాస్తవం. విడుదలకు ముందు రోజు నుంచే యానిమల్ ఫీవర్ ఎక్కించేసుకున్న నెటిజన్లు.. ఇక రిలీజ్ రోజు ఉదయం నుంచి ఈ సినిమా ముచ్చట్లతోనే సోషల్ మీడియాను నింపేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఒక బిట్ సాంగ్ వైరల్ అవుతోంది.
యానిమల్ లో హైలెట్లుగా చెప్పుకోదగ్గ ఎపిసోడ్లలో విలన్ బాబి డియోల్ పాత్ర ఇంట్లో సన్నివేశం ఒకటి. అతడి మూడో పెళ్లి జరుగుతుండగా తన పాత్రను పరిచయం చేస్తారు. ఆ సమయంలో చిన్న పిల్లల వాయిస్ తో ఒక పాట ప్లే అవుతుంది బ్యాగ్రౌండ్లో. ఆ బిట్ సాంగ్ లెంగ్త్ తక్కువే కానీ దాని ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది ప్రేక్షకులపై. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
కొత్త సినిమాల నుంచి ఏ చిన్న కంటెంట్ దొరికినా వదలని తెలుగు మీమర్స్ అయితే ఈ పాటను మామూలుగా వాడట్లేదు. రకరకాల సిచువేషన్లకు ఈ పాటను సింక్ చేసి మీమ్స్ ఆ పేలుస్తున్నారు. నిజానికి ఈ పాట యానిమల్ మ్యూజిక్ కంపోజర్స్ క్రియేట్ చేసింది కాదు. జమాల్ జమాలూ అనే అరబిక్ పాట నుంచి ఈ మ్యూజిక్ బిట్ తీసుకున్నారు. అది సినిమాలో భలేగా సెట్ అయింది. మంచి ఊపున్న ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. కొన్ని పాటలకు.. మంచి రెస్పాన్స్ రాగా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ మ్యూజిక్ బిట్టే ట్రెండ్ అవుతోంది.
This post was last modified on December 2, 2023 11:48 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…