Movie News

ప్రభాస్ ఫ్యాన్స్.. కంగారు పడకండి

నిన్న ఉదయం నుంచి ఇండియన్ బాక్సాఫీస్ లో యానిమల్ హంగామా నడుస్తుండగా.. సాయంత్రానికి మొత్తం ఫోకస్ సలార్ ట్రైలర్ మీదికి మళ్ళింది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అంటే ఇదే అని చెప్పాలి. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సలార్ రిలీజ్ ఆలస్యమైనా కూడా హైపు పెరిగిందే తప్ప తగ్గలేదు. బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది.

ట్రైలర్ తర్వాత హైప్ ఇంకో స్థాయికి చేరుతుందని అనుకుంటే.. ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఆల్రెడీ బాహుబలి తర్వాత ప్రభాస్ మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న సలార్ కూడా అటూ ఇటూ అయిందంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

అయితే ట్రైలర్ చూసి సలార్ విషయంలో విషయంలో మరీ కంగారు పడాల్సిన అవసరం లేదని గత అనుభవం చాటి చెబుతోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజిఎఫ్ 2 ట్రైలర్ కు కూడా అంత మంచి రెస్పాన్స్ ఏమీ రాలేదు. ఏముంది ఇందులో అన్నట్లుగా పెదవి విరిచారు. అంతకు ముందు వచ్చిన టీజర్ తో పోలిస్తే ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సినిమాకు కూడా తొలి రోజు మిక్స్డ్ టాకే వచ్చింది. అయినా కూడా ఆ చిత్రం అనూహ్యమైన వసూళ్లతో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాస్ సినిమాలకు ఉన్న సానుకూలత ఇదే.

ప్రశాంత్ నీల్ తన మార్కు ఎలివేషన్స్ సీన్లతో ప్రభాస్ ను అభిమానులు మాస్ ప్రేక్షకులు మెచ్చేటట్లు చూపించగలిగితే.. సినిమా పైసా వసూల్ అనిపిస్తే చాలు. కథ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. చూద్దాం మరి క్రిస్మస్ వీకెండ్లో ఏం జరుగుతుందో?

This post was last modified on December 2, 2023 11:24 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

1 hour ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

10 hours ago