ఇవాళ విడుదలైన యానిమల్ కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒక వర్గానికి నచ్చగా మరికొందరు సెకండ్ హాఫ్ కంప్లయింట్ వినిపిస్తున్నారు. ఫైనల్ గా తేల్చాల్సింది బాక్సాఫీస్ కాబట్టి ఓ రెండు మూడు రోజులు ఆగి అప్పుడు వచ్చే కలెక్షన్లను బట్టి స్థాయిని డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఓపెనింగ్స్ భీభత్సంగా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫిగర్లు నమోదు కావడం ఖాయం. అడ్వాన్స్ బుకింగ్స్ లో ముంబై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ బుకింగ్స్ ఫాస్ట్ గా ఉండటం గమనించాల్సిన విషయం. వీకెండ్ దాకా ఈ జోరు ఖాయంగా ఉంటుంది.
చివర్లో ఎండ్ టైటిల్స్ పడ్డాక ఒక ట్విస్టు ఉంటుందని అది మిస్ కావొద్దని సందీప్ వంగాతో పాటు టీమ్ ప్రత్యేకంగా చెప్పిన సంగతి తెలిసిందే. పెద్దగా దాచేంత సస్పెన్స్ ఏమి కాదు కానీ అనిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ ఉంటుందనే హింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పేరు ప్రస్తావించకూడని ఒక సర్ప్రైజ్ బాలీవుడ్ ఆర్టిస్టుతో చేయించిన స్పెషల్ క్యామియో ఊహించని రేంజ్ లో డిజైన్ చేశారు. జురాసిక్ పార్క్ లో ఎలా అయితే డైనోసార్లు విధ్వంసం సృష్టించాయో అదే తరహాలో అనిమల్ పార్క్ లో హీరోలు విలన్ల కలిసి అంత రేంజ్ లో రక్తపాతం సృష్టించబోతున్నారన్న మాట .
ఇది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పడుతుంది. ముందు ప్రభాస్ స్పిరిట్ మొదలు కావాలి. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. దానికో రెండేళ్ల నిర్మాణం అనుకున్నా తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయాలి. ఇదంతా జరిగేలోపు 2028 వస్తుంది. ఆ తర్వాత అనిమల్ పార్క్ ని తీయాలనుకున్నా చాలా సమయం ఎదురు చూడాలి. అయితే ఇప్పుడొచ్చిన యానిమల్ బ్లాక్ బస్టర్ ని మించి అనే రేంజ్ లో ఆడి కెజిఎఫ్ లాగా పేరు తెచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. రన్బీర్ కపూర్ తో సహా టీమ్ మొత్తం సిద్ధంగానే ఉంది కానీ ఎటొచ్చి సందీప్ వంగా డైరీనే ఖాళీగా లేదు మరి.
This post was last modified on December 1, 2023 3:34 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…