పెద్ద హీరోల సినిమాలు ముఖ్యంగా అవుట్ డోర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు వాటి లీకులను అదుపు చేయడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతోంది. గేమ్ చేంజర్ ఏకంగా ఆడియో సాంగ్ రిలీజై సంచలనం రేపగా గుంటూరు కారం నుంచి మహేష్ బాబు, వెన్నెల కిషోర్ మధ్య జరిగే సీన్ తాలూకు చిన్న బిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా ఫ్యామిలీ స్టార్ కూడా దీని బారిన పడాల్సి వచ్చింది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఒక పెళ్లి పాటను ఢిల్లీలో తీశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు ఇందులో స్పెషల్ క్యామియో చేస్తున్న రష్మిక మందన్న అందులో పాల్గొంది.
ఫ్యామిలీ స్టార్ లో రష్మిక గెస్టుగా చేసిందనే విషయం మొన్నటిదాకా పుకారుగానే ఉంది. ఇప్పుడీ వీడియో పుణ్యమాని కన్ఫర్మ్ చేసినట్టే. ఇలాంటివి సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తే బాగుంటుంది కానీ ఇలా లీకుల రూపంలో ముందే తెలిసిపోతే థ్రిల్ తగ్గిపోతుంది. ఎంత చిన్న బిట్ అయినా సరే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో దాని ప్రభావం పెద్దగా ఉంటోంది. రాజమౌళి లాంటి వాళ్ళు సైతం తీవ్రంగా కట్టడి చేయాలని చూసి విఫలమైన సందర్భాలున్నాయి. సరే ఫ్యామిలీ స్టార్ టీమ్ దీన్ని సీరియస్ గా తీసుకుంటుందో లేదో కానీ మిగిలినవాళ్లు మాత్రం అలెర్ట్ గా ఉండటం అవసరం.
సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ దర్శకుడు పరశురామ్ షూటింగ్ స్పీడ్ ని తగ్గించలేదు. ముందే ఆర్టిస్టుల డేట్లు తీసుకోవడంతో అవి వృథా కాకుండా ఇండియాలో పూర్తి చేయాల్సిన ఎపిసోడ్లు, పాటలు అన్నీ కానిస్తున్నారు. ఫారిన్ షెడ్యూల్ ఒకటే బ్యాలన్స్ ఉంటుంది. ఒకవేళ టైంకి వీసాలు దొరికి ఉంటే అయ్యేది కానీ దాని వల్ల చివరి నిమిషం దాకా పండగ రిలీజ్ ట్రై చేసి ఇక లాభం లేదని వదిలేసుకున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దానికన్నా ముందు కొత్త డేట్ ని జనవరి నెలాఖరుకి సెట్ చేయాలా లేక మార్చికి వెళ్లాలా అనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు బృందం బిజీగా ఉంది.
This post was last modified on December 1, 2023 11:21 am
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…