తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ హనుమాన్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకునే సమస్యే లేదని నిన్న జరిగిన కొత్త పాట విడుదల వేడుకలో మరోసారి స్పష్టంగా చెప్పేశారు. జనవరి రేసుని వదులుకోవడం ఉండదని నొక్కి వక్కాణించారు. ఫ్యామిలీ మొత్తానికి పండగ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని, ఒక కొత్త ప్రపంచంలో విహరిస్తారని ప్రశాంత్ వర్మ గ్యారెంటీ ఇస్తున్నాడు. అయితే నిజ జీవితంలో హనుమంతుడికి తన బలం బలహీనత స్వంతంగా ఎలాగైతే తెలియదో ఇక్కడా అదే జరుగుతోంది.
జనవరి 12 గుంటూరు కారం వస్తోంది. అదే రోజు హనుమాన్ తలపడటం వల్ల మహేష్ బాబు బృందానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎటొచ్చి థియేటర్ల సర్దుబాటు, షోల పంపకం గురించి తేజ సజ్జ టీమ్ టెన్షన్ పడాల్సి ఉంటుంది. ఎవరికి వారు డిస్ట్రిబ్యూటర్లు వేరుగా ఉండొచ్చు, ఒకటే కావొచ్చు. అది కాదు సమస్య. మాస్ హీరోల డామినేషన్ అధికంగా ఉండే బిసి సెంటర్లో స్క్రీన్లు తక్కువగా ఉంటాయి. వాటిని సమానంగా పంచడం కుదరదు. సహజంగానే గుంటూరు కారం డామినేషన్ ఉంటుంది. స్టార్ హీరో లేకపోవడం వల్ల హనుమాన్ ని మొదటి రోజే చూడాలన్న ఆత్రం సగటు జనాల్లో ఉండకపోవచ్చు.
కాస్త ప్రాక్టికల్ గా అలోచించి హనుమాన్ జనవరి 1 నుంచి 11 మధ్యలో లేదా 13 నుంచి 15 లోపు ప్లాన్ చేసుకుంటే ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ సొంతం చేసుకోవచ్చని బయ్యర్ల అభిప్రాయం. ఎందుకంటే గుంటూరు కారం వచ్చేనాటికి ఫోకస్ మొత్తం దాని మీదే ఉంటుంది కాబట్టి కేవలం విజువల్ ఎఫెక్ట్స్ ని చూపించి భారీ పబ్లిక్ ని హనుమాన్ కి రప్పించలేమని అంటున్నారు. కంటెంట్ అద్భుతంగా ఉండొచ్చు. దాన్ని వదలడానికి టైమింగ్ కూడా అంతే ముఖ్యం. అసలే బరిలో సైంధవ్, ఈగల్, నా సామి రంగా ఉన్నాయి. 12 నుంచి మారే ఛాన్సే లేదని హనుమాన్ అంటుంటే ఎవరైనా చేయగలిగింది ఏముంది.
This post was last modified on November 30, 2023 11:23 am
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…