Movie News

యానిమల్ మేనియాకు 5 కారణాలు

ఇంకో ఇరవై నాలుగు గంటల లోపే యానిమల్ షోలు మొదలు కాబోతున్నాయి. మొట్టమొదటిసారిగా రన్బీర్ కపూర్ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో పడనుంది. అది కూడా తెల్లవారుఝామున ఆరు గంటలకు మొదలుపెడితే దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడటం విశేషం. షారుఖ్ ఖాన్ జవాన్ కు ఇన్నేసి స్పెషల్ ప్రీమియర్లు ఏపీ తెలంగాణలో వేయలేదన్నది వాస్తవం. అంతగా సందీప్ రెడ్డి వంగా ఫీవర్ మన యూత్ లో పెరిగిపోయింది. రన్ టైం గురించి చర్చ, అడల్ట్స్ ఓన్లీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవేవీ పబ్లిక్ ని ఆపలేకపోతున్నాయి. ఇంత మేనియాకు ప్రధానంగా అయిదు కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటిది అర్జున్ రెడ్డితో సందీప్ వంగా ఏర్పరుచుకున్న బ్రాండ్. విజయ్ దేవరకొండ లాంటి కొత్త హీరోనే అంత అగ్రెసివ్ గా ఆవిష్కరించినోడు రన్బీర్ కపూర్ లాంటి సీనియర్ మోస్ట్ స్టార్ ని ఇంకే రేంజ్ లో చూపిస్తాడోననే అంచనాలు రేగడం సహజం. రెండోది ట్రైలర్ కట్. తండ్రి సెంటిమెంట్, రివెంజ్ యాంగిల్ రెండింటిని ఓపెన్ గా చూపించేసి స్టోరీ పరంగా ఎలాంటి సస్పెన్స్ లేకుండా చేయడం. మూడోది సంగీతం. పాపా మేరీ జాన్ తో సహా డిఫరెంట్ సౌండ్ తో వినిపించిన పాటలు బాగా ఎక్కేశాయి. థియేటర్ లో చూశాక వీటి రీచ్ మరింత భారీగా ఉంటుందని మ్యూజిక్ లవర్స్ ఫీలింగ్.

నాలుగోది క్యాస్టింగ్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ లను ఎంచుకోవడంలో సందీప్ వేసిన ఎత్తుగడ మంచి ఫలితాన్ని ఇవ్వనుంది. అయిదోది రన్బీర్ కపూర్ కష్టం. హింస ప్రేమ విపరీతమైన మోతాదులో ఉన్న పాత్రను అతనెంత పరకాయ ప్రవేశం చేశాడో ట్రైలర్ లోనే అర్థమైపోయింది. ఇక విశ్వరూపం చూస్తారని దర్శకుడు ఇంటర్వ్యూలలో చెప్పడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. రేపు ఈ సమయానికి ఫస్ట్ రిపోర్ట్స్, రివ్యూలు వచ్చేసి ఉంటాయి. ఏ మాత్రం బాగుందనిపించుకున్నా వసూళ్ల మోత గ్యారెంటీ. లేదూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే జవానో పఠానో రికార్డులు ఎగిరిపోవడం ఖాయం

This post was last modified on November 30, 2023 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాటేరమ్మ కొడుకులు.. ఈసారి ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…

5 minutes ago

హ్యాండ్సప్!.. అమెరికా రోడ్డెక్కిన జనం!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్……

7 minutes ago

రాజా సాబ్….త్వరగా తేల్చేయండి ప్లీజ్

గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…

3 hours ago

మాస్ ఆటతో నాటు సిక్సర్ కొట్టిన ‘పెద్ది’

https://youtu.be/2y_DH5gIrCU?si=-Esq17S1eaW7D4yg ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మాములే కానీ పెద్ది విషయంలో మాత్రం ఇది…

3 hours ago

ఎక్స్‌క్లూజివ్: పూరి-సేతుపతి సినిమాలో టబు

లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా…

4 hours ago