అసలింకా షూటింగ్ మొదలుకాకుండానే ప్రభాస్ స్పిరిట్ జనాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. యానిమల్ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సందీప్ రెడ్డి వంగాను దీని గురించి ప్రశ్నలు అడగకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. ఆయనా పూర్తిగా కంట్రోల్ చేయలేమని భావించి కొన్ని విషయాలు పంచుకుంటున్నారు. స్పిరిట్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ ప్రాంతంలో మొదలయ్యే అవకాశం ఉంది. దానికన్నా ముందు జూన్ కంతా స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. 2025 డిసెంబర్ లేదా ఆపై ఏడాది సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకుని నిర్మాణం జరగబోతోంది.
అర్జున్ రెడ్డిలో ప్రియురాలు, యానిమల్ లో తండ్రి మీద హీరోకుండే విపరీతమైన ప్రేమను థీమ్ గా తీసుకున్న సందీప్ వంగా స్పిరిట్ లో మాత్రం దానికి భిన్నంగా డ్యూటీ మీద హద్దులు దాటిన కమిట్మెంట్ ఎలా ఉంటుందో ప్రభాస్ పాత్రను అలా తీర్చిదిద్దారట. ఈ ఒక్క విషయం ఆయన చెప్పకపోయినా దగ్గరగా ఉండే సన్నిహితుల ద్వారా వినిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే డార్లింగ్ కి ఈసారి మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ సెట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రన్బీర్ కపూర్ ఇద్దరినీ ధనవంతుల కుటుంబాల్లో సెట్ చేసిన సందీప్ వంగా ఈసారి రూటు మార్చి మధ్యతరగతికి షిఫ్ట్ అయ్యాడు.
అసలు ప్రభాస్ ని ఖాకీ చొక్కాలో ఏ రేంజ్ లో చూపిస్తాడోననే అంచనాలు అభిమానుల్లో విపరీతంగా ఏర్పడుతున్నాయి. దీనికన్నా ముందు సలార్, కల్కి, మారుతీ డైరెక్షన్లో సినిమా రిలీజవుతున్నా సందీప్ మార్కు వయొలెంట్ ఎలివేషన్లతో తమ హీరోని చూసుకోవాలని ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ స్టేజిలో ఉంది కాబట్టి ఇంకా క్యాస్టింగ్ తదితర వివరాలు తెలియలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం యానిమల్ కు అనిల్ కపూర్ ని తీసుకున్నట్టే స్పిరిట్ లోనూ కొందరు ప్రధాన తారాగణంగా హిందీ ఆర్టిస్టులకే తీసుకునే అవకాశం ఎక్కువ ఉందట. స్పిరిట్ తర్వాత సందీప్ వంగాకు అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ఉంటుంది.
This post was last modified on November 29, 2023 11:55 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…