మాములుగా ఒక పెద్ద సినిమా ఏదైనా ప్రకటించాక లేక షూటింగ్ మొదలుపెట్టాక ఏడాది లేదా రెండేళ్లలోపు పూర్తి చేస్తేనే దాని మీద ఆడియన్స్ అంచనాలను క్రమం తప్పకుండ పెంచుతూ పోవచ్చు. అలా కాకుండా కారణాలు ఏమైనా నెలలు, సంవత్సరాలు ఆలస్యం చేస్తూ పోతే ఫ్యాన్స్ లోనే హైప్ తగ్గే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా పోయినేడు నవంబర్ 28న రామ్ చరణ్ 16 అధికారిక ప్రకటన వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ ప్యాన్ ఇండియా మూవీ ఉంటుందని హీరోతో సహా టీమ్ మొత్తం అనౌన్స్ చేసింది. తర్వాత ఎలాంటి కదలిక లేకుండా పోయింది.
గేమ్ చేంజర్ ఎదురు చూసే కొద్దీ జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ షూటింగ్ చేస్తూనే ఉన్నారు. దర్శకుడు శంకర్ దీంతో సమాంతరంగా భారతీయుడు 2 తీయడానికి కమిటైపోవడం వల్ల బుచ్చిబాబు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే తప్ప చరణ్ మాములు గెటప్ లోకి రాలేడు. పైగా ఆర్సి 16 కోసం ప్రత్యేకంగా మేకోవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ శంకర్ ఇదొక్కటే తీస్తూ ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిర్మాత దిల్ రాజు నిలబెట్టేవారు. కానీ సాధ్యపడలేదు. అసలు 2024లో అయినా విడుదల ఉంటుందా లేదానేది అనుమానంగానే ఉంది.
ఇకపై రామ్ చరణ్ స్పీడ్ పెంచాల్సి ఉంది. తనకన్నా కొత్త సినిమా మొదలుపెట్టడంలో ఆలస్యం చేసిన ఆర్ఆర్ఆర్ మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరని ఏప్రిల్ 5 విడుదలకు ఫిక్స్ చేసేశాడు. వార్ 2 కోసం డిసెంబర్ నుంచి హృతిక్ రోషన్ తో కలుస్తున్నాడు. వేసవి నుంచి ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీకి మైత్రి మూవీ మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత దేవర 2 కొనసాగింపు కంటిన్యూ అవుతుంది. ఇదంతా పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. కానీ రామ్ చరణ్ శంకర్ ది కాకుండా లాక్ చేసుకుంది బుచ్చుబాబుది ఒక్కటే. కనీసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెబితే ఫ్యాన్స్ ఊరట చెందుతారు.
This post was last modified on November 28, 2023 3:18 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…