‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఆ స్థాయి విజయం సాధించిన సినిమా అంటే ‘కేజీఎఫ్’యే. సౌత్ ఇండియాలో క్వాలిటీ పరంగా మిగతా వాటి కంటే దిగువన ఉండే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని.. ఇలా ఇతర భాషల వాళ్లను ఉర్రూతలూగించి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
ఐతే ఈ సినిమాకు విడుదలకు ముందే బజ్ రావడానికి.. తెలుగు, హిందీ భాషల్లో బిజినెస్ కావడానికి మన దర్శక ధీరుడు రాజమౌళి సాయం చేశాడట. ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ.. నిజం. ఈ విషయాన్ని ‘కేజీఎఫ్’ హీరో యశ్‌యే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘కేజీఎఫ్’లో రాకీ పాత్ర తెగ నచ్చేసి ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడి తయారయ్యానని.. ముందుగా కొన్ని సీన్లు తీశామని.. అవి చూశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని.. అలాంటి సందర్భంలో రాజమౌళిని కలవడం సినిమాకు చాలా మేలు చేసిందని యశ్ వెల్లడించాడు.
తమ సినిమా మేకింగ్ చర్చల్లో భాగంగా బెంగళూరులోని ఓ హోటల్లో ఉండగా.. అక్కడికి అనుకోకుండా రాజమౌళి వచ్చారని.. దీంతో ఆయనకు తమ సినిమాలోని కొన్ని విజువల్స్ చూపించామని.. అవి ఆయనకు బాగా నచ్చాయని.. తమను అభినందించి ప్రోత్సహించారని.. దీంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపైందని యశ్ వెల్లడించాడు. అంతటితో ఆగకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు తమ సినిమా గురించి చెప్పి బిజినెస్ జరగడానికి సాయం చేశారని యశ్ తెలిపాడు.
తెలుగులో రాజమౌళి మిత్రుడే అయిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇక రాజమౌళి జడ్జిమెంట్‌ను నమ్మి హిందీ డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా మీద పెట్టుబడి పెట్టి మంచి ఫలితాన్నందుకున్నారు. ఈ రకంగా ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించడంలో మన రాజమౌళి పాత్ర కూడా ఉందన్నమాట.
This post was last modified on August 31, 2020 9:47 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…