ఇంకో మూడు రోజుల్లోనే ‘యానిమల్’ సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఆ సినిమా రన్ టైం గురించి ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. ఏకంగా 3 గంటల 21 నిమిషాల ఫైనల్ కట్‌తో సినిమాను థియేటర్లలోకి వదిలేస్తున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మూడు గంటల సినిమాకే అమ్మో అనుకునే రోజులు ఇవి. అలాంటిది ఇంకో 21 నిమిషాలు అదనపు నిడివితో సినిమా ఉంటే ప్రేక్షకులు తట్టుకోగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సినిమాలో విషయం ఉంటే.. నిడివి అనేది పెద్ద సమస్యే కాదని సందీప్ అండ్ కో అంటోంది.
నిజానికి ‘యానిమల్’ ఒరిజినల్ రన్ టైం ఇంకా ఎక్కువట. 3 గంటల 50 నిమిషాల నిడివితో ఫస్ట్ కాపీ రెడీ చేశాడట సందీప్. ఈ విషయాన్ని స్వయంగా హీరో రణబీర్ కపూర్ ప్రెస్ మీట్లో చెప్పడం విశేషం.
ఐతే థియేటర్లలో మరీ అంత నిడివితో రిలీజ్ చేస్తే అంతే సంగతులు. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చుకోవాలి. సినిమా ఎంత బాగున్నా కూడా అంత సేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడం సవాలే. దీనికి తోడు థియేటర్ల యాజమాన్యాలు రోజుకు నాలుగు షోలు నడపడం కూడా కష్టమై గగ్గోలు పెడతాయి. అందుకే అతి కష్టం మీద సినిమా నిడివిని ఇంకో 29 నిమిషాలు తగ్గించాడట సందీప్ రెడ్డి.
ఐతే థియేటర్లలోకి 3.21 గంటల రన్ టైంతో వదిలినా.. ఓటీటీలో సినిమా రిలీజైనపుడు మాత్రం ఒరిజినల్ రన్ టైమే ఉంటుందట. ఓటీటీలో చూసే ప్రేక్షకుల్లో ఎవరి ఓపిక వాళ్లది. అందులోనూ థియేటర్లతో పోలిస్తే అదనపు సన్నివేశాలు ఉన్నాయంటే మరింత ఆసక్తితో చూస్తారు. కాబట్టి ఓటీటీ వెర్షన్‌లో డైరెక్టర్స్ కట్ చూడొచ్చన్నమాట. ‘యానిమల్’ థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
This post was last modified on November 27, 2023 3:47 pm
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…