ఏదైనా పెద్ద సినిమాకు హైప్ తేవడంతో సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తోందో చూస్తున్నాం. కేవలం ఒక్క పాట గీత గోవిందం, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఎస్ఆర్ కల్యాణ మండపం లాంటి వాటికి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. లింగిడి లింగిడి రీచ్ కాకపోయి ఉంటే కోటబొమ్మాళి పీఎస్ మీద మొదటి రోజు ఫోకస్ వచ్చేది కాదు. దాన్నే ఆయుధంగా టీమ్ ప్రమోషన్ కు వాడుకుంది. అయితే ఏరికోరి మరీ పక్క బాష నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకొస్తుంటే వాళ్ళు మాత్రం నిరాశపరిచే స్కోర్ తో ఇటు సాంగ్స్ అటు బీజీఎమ్ రెండు రకాలుగా బెస్ట్ ఆడియో ఇవ్వలేక ఉసూరుమనిపిస్తున్నారు.
ఈ ప్రస్తావన జీవి ప్రకాష్ కుమార్ గురించి. ఈ మూడు నెలల్లో అతను రెండు స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీస్ కి పని చేశాడు. ఒకటి టైగర్ నాగేశ్వరరావు. రెండోది ఆదికేశవ. కంటెంట్, ఫైనల్ బాక్సాఫీస్ ఫలితాలు పక్కనపెడితే మ్యూజిక్ పరంగా ఆడియన్స్ కివి పెద్దగా రీచ్ కాలేదు. ఏ పాటా అందరూ ఆమోదించేలా ఛార్ట్ బస్టర్ కాలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కూడా కామెంట్స్ వచ్చాయి. తమిళంలో విపరీతమైన బిజీగా ఉన్న ప్రకాష్ కు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తెచ్చుకున్నారు ఆయా దర్శక నిర్మాతలు. ఈ విషయంలో సంతోష్ నారాయణన్ కొంచెం మెరుగని చెప్పొచ్చు.
ఇక్కడితో అయిపోలేదు. జివి ప్రకాష్ చేతిలో మరో రెండు క్రేజీ చిత్రాలున్నాయి. ఒకటి వరుణ్ తేజ్ మట్కా. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో దర్శకుడు కరుణ కుమార్ తీస్తున్న ఈ వింటేజ్ డ్రామా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. మరొకటి నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్.వీటికైనా బెస్ట్ రాబట్టుకోవాలి. ఒకప్పుడు తెలుగులోనూ మంచి పాటలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఇలా చేయడం సబబు కాదు. తమిళంలో కెప్టెన్ మిల్లర్, తంగలాన్, సూర్య-సుధా కొంగర, సైరెన్ తదితర సినిమాలతో కుర్రాడు మాములు బిజీగా లేడు. వంద చిత్రాల మైలురాయి కూడా అందుకున్నాడు.
This post was last modified on November 26, 2023 8:35 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…