బాలీవుడ్ హీరోలు ఇప్పుడు సౌత్ ఇండియా ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నార్త్ ఇండియాలో సౌత్ హీరోల సినిమాల హవా అంతకంతకూ పెరుగుతుండగా.. బాలీవుడ్ హీరోలు తమ చిత్రాలకు సౌత్‌లో రీచ్ పెంచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలను దక్షిణాదిన బాగా ప్రమోట్ చేయడం ద్వారా మంచి వసూళ్లు తెచ్చుకోగలిగాడు. ఆల్రెడీ ‘బ్రహ్మాస్త్ర’తో దక్షిణాదిన మంచి ఫలితాన్నందుకున్న రణబీర్ కపూర్.. ఇప్పుడు ‘యానిమల్’తో ఇక్కడి ప్రేక్షకులను మరింతగా మెప్పించాలని చూస్తున్నాడు.
ఇప్పటికే ‘యానిమల్’ ప్రోమోలు సినిమాకు తెలుగు సహా దక్షిణాది భాషల్లో మంచి హైప్ తీసుకొచ్చాయి. దీనికి ప్రమోషన్ల హడావుడి కూడా తోడైతే ఓపెనింగ్స్ మరింత ఎక్కువ ఉంటాయని టీం భావిస్తోంది. ఈ క్రమంలోనే రణబీర్.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ రష్మికలతో కలిసి బాలయ్య షో ‘అన్‌స్టాపబుల్’కు వచ్చాడు.
ఈ షోను రణబీర్ భలే ఎంజాయ్ చేశాడని షో చూసిన వాళ్లెవ్వరికైనా అర్థమైపోతుంది. బాలయ్య అండ్ కో.. రణబీర్‌ను రిసీవ్ చేసుకున్న తీరు.. తన ఫ్యామిలీ లెగసీ గురించి షోలో ఇచ్చిన ప్రెజెంటేషన్.. అతడితో బాలయ్య సంభాషణ చూడముచ్చటగా అనిపించాయి. కపూర్ వంశీ ఘన చరిత్ర గురించి ఒక హృద్యమైన వీడియోతో రణబీర్‌ను కదిలించింది అన్‌స్టాపబుల్ టీం. ఇక బాలయ్య.. పృథ్వీరాజ్ కపూర్ సహా ఆ వంశపు హీరోల సినిమాల్లోని ఫేమస్ డైలాగులను పలుకుతూ రణబీర్‌ను టచ్ చేశాడు. ఇద్దరి మధ్య హిందీ సంభాషణ కూడా హుషారుగా సాగింది.
ఇక పెళ్లికి ముందు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని రణబీర్ అన్నపుడు బాలయ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్.. ఆలియాతో అనుబంధం గురించి మాట్లాడిన మాటలు సరదాగా అనిపించాయి. రణబీర్ సైతం ‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..’’.. ‘‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.. లాంటి బాలయ్య డైలాగులను చెప్పి ఆయన అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అనడంలో సందేహం లేదు.
This post was last modified on November 25, 2023 11:43 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…