సినిమా ప్రమోట్ చేసే క్రమంలో హీరోతో పాటు హీరోయిన్ ఉంటేనే ఆడియన్స్ కి నిండుగా అనిపిస్తుంది. ఒకరు లేకపోయినా అదేంటనే అనుమానం రావడం సహజం. మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న పబ్లిసిటీలో ఎక్కడా కనిపించడం లేదు. కారణం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ పాట షూట్ లో బిజీగా ఉండటమే. ప్రస్తుతం దీని చిత్రీకరణ ముంబైలో జరుగుతోందట. చాలా రోజుల క్రితమే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ రిలీజ్ దగ్గరగా ఉన్న టైంలో యాక్టివ్ కావడం చాలా అవసరం. పైగా కేవలం రెండు వారాల టైం మాత్రమే ఉండటంతో నాని ఒక్కడి మీదే భారం పడుతోంది.
ఇంకోవైపు శ్రీలీలకు ఇదే సమస్య. ఆదికేశవకు బజ్ తేవడానికి తనే కీలకం. అయితే నితిన్ ఎక్స్ ట్రాడినరీ సాంగ్ షూట్ ఆఘమేఘాల మీద జరుగుతుండటంతో రాలేని పరిస్థితి. కనీసం ప్రెస్ మీట్ కు వద్దామన్నా కుదరలేదు. దీంతో నిర్మాత నాగవంశీ, దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి, హీరో వైష్ణవ్ తేజ్ అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. నిన్నే వీక్ ఓపెనింగ్స్ తో పాటు టాక్ నెగటివ్ గా వచ్చేసింది. అంతో ఇంతో పాజిటివ్ గా ఒక్క పాయింట్ ఉందంటే అది శ్రీలీల గ్లామర్ ప్లస్ డాన్సులు మాత్రమే. తీరా చూస్తే ఆ అమ్మాయే రాలేని సిచువేషన్. ఫలితం తేలిపోయింది కాబట్టి ఇక వచ్చినా లాభం లేదు.
వీళ్ళే కాదు గతంలో సమంతా సైతం ఆరోగ్యం కారణంగా రాలేకపోతే ఖుషికి విజయ్ దేవరకొండ ఫ్రంట్ ఫేస్ అయ్యాడు. అనుష్క నిస్సహాయత వ్యక్తం చేస్తే నవీన్ పోలిశెట్టి వల్లే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ఓవర్సీస్ నుంచి ఇండియా దాకా మంచి షేర్లు వచ్చాయి. హాయ్ నాన్నలో మృణాల్ ఠాకూర్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నానితో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. అలాంటప్పుడు మీడియా కెమరా, అభిమానుల ముందుకు రావాలి. పైగా తను ముంబైలో ఉంటూ బాలీవుడ్ కమిట్ మెంట్లు కూడా చూసుకోవాలి కాబట్టి ఒత్తిడి తప్పడం లేదు. రాను రాను ప్రమోషన్లకు కూడా ముందే కాల్ షీట్లు తీసుకోవాల్సి వచ్చేలా ఉంది.
This post was last modified on November 25, 2023 11:11 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…