Movie News

నానిని కవ్విస్తున్న వయొలెంట్ నాన్న

డిసెంబర్ 7 విడుదల కాబోతున్న హాయ్ నాన్న కోసం న్యాచురల్ స్టార్ నాని ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తున్నాడు. డేట్ల సమస్య వల్ల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో భారం మొత్తం తన మీదే పడింది. వెరైటీ వీడియోలతో ఆకట్టుకుంటున్న తీరు సినిమాని ఆడియన్స్ కి ఇంకా దగ్గర చేస్తోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ లు వాయిదా పడటం దాదాపు లాంఛనమే కావడంతో నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ ని ఒకటే కాచుకోవాల్సి ఉంటుంది. అయితే నానికో ఊహించని సవాల్ బాక్సాఫీస్ వద్ద ఎదురు కాబోతోంది.

సరిగ్గా వారం రోజుల ముందు డిసెంబర్ 1న రిలీజవుతున్న అనిమల్ మీద ఒక్కసారిగా హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ట్రైలర్ చూశాక యూత్ ఖచ్చితంగా చూడాలని ఫిక్సయిపోయారు. ఏ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ జనాలకు కూడా నచ్చుతుందనే ధీమా మేకర్స్ లో కనిపిస్తోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అనిమల్ సునామి కనీసం రెండు వారాల పాటు ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో, కేరళ లాంటి చోట్ల స్ట్రాంగ్ రన్ దక్కుతుంది. అక్కడ నానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. రెండు ఎమోషనల్ కథలే అయినప్పటికీ ట్రీట్ మెంట్ లో ఉన్న వ్యత్యాసం రీచ్ ని మారుస్తుంది.

సో అనిమల్ టాక్ ఎలా వస్తుందనేది హాయ్ నాన్నకు కీలకంగా మారుతుంది. కూతురు సెంటిమెంట్ తో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చగా పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. ఇంతకీ కథ తాలూకు తీరు తెన్నులు ఇవాళ సాయంత్రం విడుదల కాబోయే ట్రైలర్ వచ్చాక క్లారిటీ వస్తుంది. దసరా లాంటి ఊర మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మూవీ కావడంతో కంటెంట్ పరంగా హాయ్ నాన్న మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ క్లాస్ ఆడియన్స్ తో పాటు కొంచెం మాస్ జనాలకు కనెక్ట్ అయితే చాలు హిట్టే.

This post was last modified on November 24, 2023 9:51 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago