యానిమల్.. యానిమల్.. యానిమల్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఇంకా ఈ సినిమా థియేటర్లలోకి దిగలేదు. కేవలం ప్రోమోలతోనే ఈ సినిమా మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయట్లేదు. గత నెలలో వచ్చిన టీజర్.. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ ఒకదాన్ని మించి ఒకటి చర్చనీయాంశంగా మారాయి. ‘అర్జున్ రెడ్డి’తో అప్పట్లో ప్రకంపనలు రేపిన సందీప్ రెడ్డి వంగ.. ‘యానిమల్’తో దాన్ని మించిన సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు.
ఇప్పటికే ఉన్న భారీ అంచనాలను మించిపోయేలా ట్రైలర్ ఉండటంతో ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న యువ ప్రేక్షకుల్లో ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఇక ట్రైలర్ లాంచ్ తర్వాత టాలీవుడ్లో ప్రధానంగా ఒక హీరో మీదికి అందరి దృష్టీ మళ్లింది. ఆ హీరో ఎవరో కాదు.. మహేష్ బాబు.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత తన రెండో సినిమాను మహేష్ బాబుతోనే చేయాలనుకున్నాడు సందీప్. మహేష్‌తో సంప్రదింపులు కూడా జరిగాయి. కానీ ఎందుకో సినిమా ముందుకు కదల్లేదు. ఈలోపు ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ రిలీజై అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేయడం.. తన వర్క్ నచ్చి రణబీర్ కపూర్, భూషణ్ కుమార్ తర్వాతి సినిమాకు కమిట్ కావడంతో ‘యానిమల్’ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ప్రోమోలు చూస్తూ సందీప్‌తో ఒక్క సినిమా చేయాలని స్టార్ హీరోలందరూ తహతహలాడుతుంటే ఆశ్చర్యం లేదు. కాగా సందీప్‌తో సినిమా చేసే అవకాశాన్ని మహేష్ ఎలా వదులుకున్నాడని అతడి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కొన్నేళ్లుగా మహేష్ సినిమాలు ఒక మూసలో సాగిపోతున్నాయి. అతడిలోని పెర్ఫామర్‌ను దర్శకులు సరిగా వాడుకోలేదనే బాధ వారిలో ఉంది.
‘యానిమల్’ లాంటి సినిమా చేస్తే మహేష్ అభిమానులకు మామూలు కిక్ ఉండేది కాదు. అతడికి బాగా సూటయ్యే పాత్రలానూ కనిపించింది. కాకపోతే వయొలెన్స్ డోస్ మరీ ఇంతైతే కష్టమయ్యేదేమో. కానీ మహేష్ ఇలాంటి కథలో నటిస్తే మాత్రం బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం. సందీప్ ఇదే కథను మహేష్‌కు చెబితే రిజెక్ట్ చేశాడా అన్నది క్లారిటీ లేదు కానీ.. తనతో అతను సినిమా చేయాల్సిందన్న అభిప్రాయం మాత్రం కలుగుతోంది. భవిష్యత్తులో అయినా వీరి కలయికలో సినిమా రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
This post was last modified on November 24, 2023 9:03 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…