మోస్ట్ అవైటెడ్ ‘యానిమల్’ ట్రైలర్ రానే వచ్చింది. టీజర్ చూశాక ట్రైలర్ మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండగా, ట్రైలర్ ఆ అంచనాలను కూడా మించిపోయింది. తండ్రీ కొడుకులు పాత్రలు మార్చుకునే తొలి సన్నివేశంతోనే షేకాడించేశాడు సందీప్ రెడ్డి. ఏదో ఒక హార్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది జనాలకు ట్రైలర్ చూస్తుంటే. ఇండియన్ మూవీస్‌లో ఇప్పటిదాకా ఎంతో వయొలెన్స్ చూశాం కానీ.. ఇందులో హింస ఇంకో స్థాయిలో ఉంటుందని ట్రైలర్ అడుగడుగునా హింట్ ఇస్తూనే సాగింది.
తెర మీద అందరూ రక్తపాతం చూపిస్తారు కానీ.. ఇందులో చూపించిన బ్లడ్ బాత్ స్టైల్ వేరు. ఒక రకమైన భయాన్ని కలిగించాయి కొన్ని షాట్లు. ట్రైలర్లో ఈ షాట్లు చూశాక ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడు సందీప్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.
ఆ వీడియోలో ‘కబీర్ సింగ్’కు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడాడు సందీప్. తన సినిమాను ఆయన విమర్శిస్తూ కేవలం 2 రేటింగ్ ఇచ్చారని.. ఐతే తన సినిమా రొండొందల కోట్ల వసూళ్లు రాబట్టిందని సందీప్ అన్నాడు. రేటింగ్ గురించి తనకు బాధేమీ లేదని.. కానీ తన కొత్త సినిమా రిలీజైనపుడు ఇదే క్రిటిక్స్ ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని అతను చెప్పాడు.
‘కబీర్ సింగ్’ను వయొలెంట్ ఫిలిం అని క్రిటిక్స్ అన్నారని.. కానీ అసలు వయొలెన్స్ అంటే ఏంటి అన్నది తన తర్వాతి సినిమాలో చూపించబోతున్నానని.. అప్పుడు వారి స్పందన చూడాలనుకుంటున్నానని సందీప్ చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు ‘యానిమల్’ చూస్తుంటే ఇది కదా వయొలెన్స్ అంటే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ వయొలెంట్ ఫిలిం చూపించబోతున్నట్లు ఆ రోజు చెప్పకనే చెప్పిన సందీప్.. ఈ రోజు ఆ మాటనే నిజం చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 23, 2023 8:27 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…