ఇప్పుడు బ్రతికి లేడు కానీ ఒకప్పుడు నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించిన గజదొంగ వీరప్పన్. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి మరీ గవర్నమెంట్ ముందు డిమాండ్లు పెట్టిన ఘనుడు. ఇతని గురించి ఎన్నెన్ని కథలు ప్రచారంలో ఉన్నాయో చెప్పడం కష్టం. వేలాది ఏనుగులను దంతాల కోసమే హతమార్చడం, వందల్లో పోలీసులను కిరాతకంగా చంపడం లాంటి ఎన్నో దుర్మార్గాలు ఇతని చరిత్ర పుస్తకంలో ఉన్నాయి. ఇన్ని చేసినా మంచివాడిగా కొలిచే వారు లేకపోలేదు. అడవి దగ్గరి గ్రామాల ప్రజలను బాగా చూసుకోవడం దానికో కారణంగా చెబుతారు.
సరే ఇదంతా గడిచిపోయినా గతమని మర్చిపోదామనుకున్నా దర్శక నిర్మాతలు వదిలిపెట్టడం లేదు. సినిమాలు వెబ్ సిరీస్ లు తీస్తూనే ఉన్నారు. త్వరలో జీ5లో ‘కూసే మునిస్వామి వీరప్పన్’ పేరుతో ఒక డాక్యు సిరీస్ రాబోతోంది. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేస్తే ప్రత్యేకంగా స్టార్ హీరో సూర్య దాన్ని షేర్ చేశాడు. దీనికన్నా ముందు కొన్నివారాల క్రితమే నెట్ ఫ్లిక్స్ లో ఇదే తరహాలో ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ పేరుతో ఒక సిరీస్ ని స్ట్రీమింగ్ చేస్తే దానికి మంచి స్పందన వచ్చింది. గతంలో శివరాజ్ కుమార్ తో రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో భారీ చిత్రాన్ని తీస్తే కన్నడలో మంచి వసూళ్లు రాబట్టింది.
కిషోర్-అర్జున్ సర్జ ప్రధాన పాత్రల్లో ‘అట్టహాస’ అనే మరో చిత్రం వీరప్పన్ మీదే వచ్చింది. ఇంకా వెనక్కు వెళ్తే నాజర్, దేవరాజ్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఈ గజదొంగ క్యారెక్టర్లలో మెరిసిన వారే. గర్వించదగే గొప్ప గాథ కాకపోయినా పదే పదే వీరప్పన్ గురించి చెప్పాలని తాపత్రయ పడటం విచిత్రంగా ఉంది. మణిరత్నం విలన్ లో విక్రమ్ పాత్రను డిజైన్ చేసింది ఈ స్ఫూర్తితోనే. ఫ్లాష్ బ్యాక్ లో చూపించే ప్రియమణి ఎపిసోడ్ నిజంగా జరిగిందేనని అప్పటి జర్నలిస్టులు చెబుతారు. చూస్తుంటే తిరిగి ఇన్నేళ్ల తర్వాత వీరప్పన్ మరోసారి అమ్ముకునే వస్తువుగా మారిపోయాడు. అంతే మరి బిజినెస్ అన్నాక ఎవరైనా వాడుకోవచ్చు.
This post was last modified on November 23, 2023 6:54 pm
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.…
విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలిసిందే. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ డిజాస్టర్లతో అతను…
అవినీతి మకిలి అంటకుండా సాగితే…అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కడుపులో చల్ల కదలకుండా నిర్భయంగా ఉండొచ్చు. అదే అవినీతిలో నిండా…
దేశంలోని మెజారిటీ ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఈ బిల్లుపై…
ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ధనుష్ ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) ఏకంగా అక్టోబర్ కు వెళ్ళిపోయింది. ఆ నెల…
ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఏలిన లెజెండరీ డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్లుగా ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. ఐ,…