ఇండస్ట్రీలో కొన్ని ఫ్రెండ్‌షిప్స్ చాలా స్పెషల్. ప్రత్యేకంగా కలిసి సినిమా చేయకపోయినా దర్శకుడు మారుతికి, హీరో అల్లుఅర్జున్‌కి మంచి స్నేహం ఉందనే అందరికీ తెలుసు. డైరెక్టర్ మారుతి చాలాసార్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నాడు. అయితే అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రేమకథా చిత్రం’ నుంచి, బన్నీతో సినిమా చేస్తానంటున్నాడు మారుతి. ఏళ్లు గడుస్తున్నా ఈ కాంబోలో సినిమా మాత్రం రావడం లేదు… అయితే కలిసి సినిమా చేయకపోయినా, మా స్నేహం వాట్సాప్ జోక్స్‌తో ముడిపడి ఉందని అంటున్నాడు మారుతి.
తాజాగా ఓ ఇంటర్య్వూలో బన్నీతో ఫ్రెండ్ షిప్ గురించి మరోసారి చెప్పుకొచ్చాడు మారుతి. తాను, బన్నీ రోజూ వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకుంటామని… అల్లుఅర్జున్ తనకు ఏవోవో జోక్స్ పంపిస్తుంటాడని, తాను కూడా వాట్సాప్ జోక్స్‌ని ఆయనకి పంపుతుంటానని చెప్పుకొచ్చాడు మారుతి.
మంచి సబ్జెక్ట్ వస్తే, త్వరలోనే బన్నీతో సినిమా చేస్తానంటూ మరోసారి హామీ ఇచ్చాడు మారుతి. నిజానికి అప్పుడెప్పుడో బన్నీ యానిమేషన్ నేర్చుకున్నప్పటి నుండి బన్నీతో మారుతికి పరిచయం ఉంది. చిరూ ‘ప్రజారాజ్యం’ టైమ్ లో మారుతికీ, బన్నీకి ఇంకా క్లోజ్నెస్ పెరిగిందిలే. ప్రజారాజ్యం పార్టీ జెండా డిజైన్‌తో పాటు ప్రచార కార్యక్రమాల రూపకల్పనలోనూ చురుగ్గా పాల్గొన్న మారుతికి, స్టైలిష్ స్టార్‌తో ఆయన కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
ఇంతకుముందు అల్లు శిరీష్‌తోనూ ‘కొత్త జంట’ సినిమా చేసి, ఓ మోస్తారు హిట్ ఇచ్చాడు మారుతి. అలాగే భలే భలే మగాడివోయ్ వంటి హిట్టు సినిమాలు కూడా అల్లూ క్యాంపుకు అందించాడీ డైరక్టర్. ఆ రిలేషన్‌తోనే ‘ఆహ’ ఓటీటీకి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లను ఎంపిక చేసే బాధ్యత మారుతికి అప్పగించారని టాక్.
This post was last modified on April 25, 2020 11:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…