సంక్రాంతి రేసు నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తప్పుకున్నట్టే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆమేరకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రాధమిక సమాచారం అందిందని తెలిసింది. ఇతర సినిమాల థియేటర్ అగ్రిమెంట్లు మొదలయ్యాయి కాబట్టి ఏదైనా ఉంటే ఈ నెలలోనే నిర్ణయించుకోవాలి. దర్శకుడు పరశురామ్ శాయశక్తులా టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నప్పటికీ ఫారిన్ షెడ్యూల్స్ వల్ల వచ్చిన వీసా సమస్య పెద్ద అడ్డంకిగా మారింది. దాని పరిష్కారం సాధ్యపడకపోవడంతో హడావిడి పడకుండా నెమ్మదిగానే చేసుకుని మార్చిలో విడుదల ప్లాన్ చేద్దామని ఎస్విసి టీమ్ నిర్ణయించుకుందట.
దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కోణం వినిపిస్తోంది. గుంటూరు కారం నైజామ్ హక్కులు దిల్ రాజు కొన్నారు. సైంధవ్ ఉత్తరాంధ్ర రైట్స్ ఆయనకే వచ్చాయట. హనుమాన్, ఈగల్ కూడా ఒకటి రెండు ప్రాంతాలు సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పంపిణి చేస్తున్న టైంలో మళ్ళీ తన నిర్మాణంలోనే ఉన్న ఫ్యామిలీ స్టార్ ని దింపితే థియేటర్ల పరంగా సమస్య రాకపోయినా ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఎదురవుతుందని గుర్తించి వెనక్కు తగ్గాలని ఫిక్స్ అయ్యారట. అధికారికంగా ప్రకటన లేదు కాబట్టి అభిమానులు మాత్రం రౌడీ హీరోని జనవరిలో తెరమీద చూస్తామనే నమ్మకంతో ఉన్నారు.
ఇదంతా చర్చల దశలో ఉన్న వ్యవహారం కనక ప్రస్తుతానికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటూ వాయిదా వార్తలు బయటికి చెప్పడం లేదు. సంక్రాంతి సినిమాల బిజినెస్ చాలా వాడివేడిగా జరుగుతోంది. గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్ లు ఆల్రెడీ బెర్తులు కన్ఫర్మ్ చేసుకోగా నా సామి రంగా రావడం ఖాయమని అక్కినేని వర్గాల సమాచారం. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కెప్టెన్ మిల్లర్, లాల్ సలామ్, ఆయలాన్ లు ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా విజయ్ దేవరకొండ మార్కెట్ దృష్ట్యా పోటీలో చిక్కులు పడకుండా ఫ్యామిలీ స్టార్ సోలోగా రావడమే అన్ని రకాలుగా సేఫ్
Gulte Telugu Telugu Political and Movie News Updates