హాలీవుడ్ నుంచి ఇండియా దాకా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న వేధింపులు అన్ని బాషల పరిశ్రమలో ఉన్నవే. కొన్నేళ్ల క్రితం భారతీయుడు ఫేమ్ కస్తూరి, రాధికా ఆప్టే తదితరులు పలువురు నటుల మీద ఆరోపణలు చేశారు కానీ వాటి వల్ల వచ్చిన ఫలితం, తీసుకున్న చర్యలు కానీ ఏమి లేవు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ నటి విచిత్ర చేరింది. ఈవిడ కమల్ హాసన్ యాంకరింగ్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ 7లో పార్టిసిపెంట్ గా చేసింది. విచిత్ర ఇప్పటి యాక్టర్ కాదు. ఎప్పుడో 1991లో కెరీర్ మొదలుపెట్టి తమిళ మలయాళం కన్నడలో హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ చాలానే చేసింది.
తమ జీవితంలోని గుర్తుపెట్టుకుని టర్నింగ్ పాయింట్ గురించి చెప్పమన్నప్పుడు విచిత్ర ఓ సంఘటన షేర్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇరవై ఏళ్ళ క్రితం ఒక భారీ చిత్రంలో నటిస్తున్నప్పుడు షూటింగ్ బ్రేక్ లో సదరు హీరో గదికి రమ్మని పిలిచాడట. దీన్ని తిరస్కరించిన విచిత్ర ఈ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళ్తే ఆయన రివర్స్ లో మందలించి తిట్టి పంపడంతో షాక్ అవ్వడం విచిత్ర వంతైంది. అక్కడి నుంచి టీమ్ సభ్యుల నుంచి వేధింపులు మొదలయ్యాయట. ఈ స్పాట్ లో మేనేజర్ గా వ్యవహరించిన వ్యక్తినే విచిత్ర ప్రేమ వివాహం చేసుకోవడం ట్విస్టు.
ఇదంతా దేని గురించి ఎవరి గురించో క్లారిటీ లేకపోయినా సంఘటనను పలురకాలుగా ముడిపెట్టి నెటిజెన్లు రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నారు. విచిత్ర ఇదొక్కటే కాదు ఒక ఫైట్ మాస్టర్ తో ఇదే తరహాలో జరిగిన మరో ఘటన కూడా వివరించింది. అసలు విచిత్ర ఎవరో ఇతర బాషల జనాలు మర్చిపోయిన తరుణంలో కేవలం ఒక్క ఇంటర్వ్యూతో ఆమె నటించిన సినిమాలు, హిట్లు ఫ్లాపులు జనం గూగుల్ లో వెతుకుతున్నారు. అంతే మరి ట్విట్టర్ లో ఏదైనా ఒక టాపిక్ హాట్ గా మారడం ఆలస్యం అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది.
This post was last modified on November 22, 2023 11:12 am
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…