టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బయట బాగా బిడియంతో కనిపించేది ఎవరంటే విక్టరీ వెంకటేష్ పేరు చెప్పేయొచ్చు. ఆయన పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం తక్కువ. పాల్గొన్నా కూడా పొడి పొడిగానే మాట్లాడతారు. చాలా వరకు కామ్‌గా కనిపిస్తారు.
అలాంటి వ్యక్తి ఒక కాలేజీకి వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేయడం.. అక్కడ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హిట్ ఫ్రాంఛైజీ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకీ నటించిన కొత్త చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా నుంచి తాజాగా రాంగ్ యూసేజ్ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాట మంచి హుషారుగా సాగేదే. గురు సినిమాలోని ఎంగిడి ఎంగిడి పాట స్టయిల్లో సాగే ఈ పాట ఇన్‌స్టంట్ హిట్టయింది.
కాగా ఈ పాట లాంచ్ ఒక ఇంజినీరింగ్ కాలేజీలో పెట్టారు. అక్కడ విద్యార్థులను చూడగానే వెంకీకి ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది. వాళ్లను చూసి ఆయన స్టేజ్ మీద చాలా హుషారుగా మాట్లాడారు. గెంతులేశారు. అంతే కాక పాట లాంచ్ సమయంలో వాసు సహా పలు వెంకీ సినిమాల్లోని పాటలకు విద్యార్థులు స్టెప్పులేస్తుంటే వెంకీ కూడా వాళ్లతో కలిసిపోయారు. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్లతో కలిసి మంచి హుషారుగా స్టెప్పులేశారు.
ఈ వయసులో వెంకీ చూపించిన ఎనర్జీ.. తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన తపన పడుతున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకీ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించిన సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. వచ్చే నెలలో సైంధవ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇంతకుముందు లాంచ్ చేసిన టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండటంతో అభిమానులు సినిమాపై మంచి అంచనాలతో ఉన్నారు.
This post was last modified on November 22, 2023 10:06 am
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…