సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘గుంటూరు కారం’ఫై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం త్రివిక్రమ్‌తో మహేష్ జట్టు కట్టడంతో మొదట్నుంచీ ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మధ్యలో కొన్ని నెగెటివ్ వార్తల వల్ల సినిమాకు కొంత ఇబ్బంది నెలకొన్నప్పటికీ.. ఆ తర్వాత అదంతా పక్కకు వెళ్లిపోయింది.
సంక్రాంతి టార్గెట్‌గా సినిమా టీం వడివడిగా పని పూర్తి చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీం ‘దమ్ మసాలా’ పాటను చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అది నిజమేనని ఒక వీడియో ద్వారా తేలింది. హైదరాబాద్‌లో ఒక సెట్ వేసి తీస్తున్న ఈ పాటకు సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియో ఒకటి లీక్ అయింది. అందులో మహేష్ బాబు వీర లెవెల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.
‘దమ్ మసాలా’ పాట వింటేనే మంచి ఊపున్న మాస్ సాంగ్ అని అర్థమవుతుంది. అందుకు తగ్గట్లే ఆ పాటకు మాస్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నట్లున్నారు. లీక్డ్ వీడియోలో మహేష్ చాలా ఉత్సాహంగా మాస్ స్టెప్స్ వేస్తూ కనిపించాడు. మహేష్ ఇంత ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అరుదు. చాలా ఏళ్ల నుంచి మహేష్ డ్యాన్సుల మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది.
అలాగే ఆయన సినిమాలు కూడా క్లాస్‌గా ఉంటున్నాయని, మాస్ అప్పీల్ తగ్గిపోతోందనే బాధ కూడా ఉంది. ఐతే ‘గుంటూరు కారం’ పక్కా మాస్ మూవీ అనే సంకేతాలు ముందు నుంచి వస్తున్నాయి. ఇప్పుడు లీక్ అయిన వీడియో ఆ ఇండికేషన్స్‌ను ఇంకా పెంచింది. సినిమాలో ఇంకా ఇలాంటి మాస్ పాటలు ఉంటాయని.. మహేష్ డ్యాన్సుల మోతను చూడొచ్చని చిత్ర వర్గాలు చెబుతుండటం అభిమానులకు ఇంకా ఉత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on November 21, 2023 6:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…