Movie News

సలార్ అనుమతులు ఎప్పుడిస్తారు

డిసెంబర్ 22 విడుదల కాబోతున్న సలార్ టికెట్ రేట్ల పెంపు కోసం హోంబాలే ఫిలిమ్స్ నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టేసుకున్నారు. కర్ణాటకలో ప్రైస్ క్యాపింగ్ లేదు కాబట్టి అక్కడ అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో మాత్రం అప్లై చేసుకోవాల్సిందే. హిందీలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతర భాషల్లో కనీసం యాభై నుంచి డెబ్భై అయిదు రూపాయల వరకు గరిష్టంగా పెంపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.  అయితే పర్మిషన్లు రావడానికి కొంత టైం పట్టేలా లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పథకాలు, మినహాయింపులు ఏ రంగానికి ఇవ్వకూడదు.

అధికార పార్టీ బిఆర్ఎస్ వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదా బిజెపి అయినా సమస్య కాదు కానీ ప్రాసెస్ ఆలస్యమయ్యే అవకాశముంటుంది. కానీ విశ్లేషణలు రూలింగ్ కి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. సో డిసెంబర్ మొదటి వారం అయ్యాకే క్లారిటీ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిబంధనల కారణంగా పెద్ద హీరోల సినిమాలు సైతం చేయి దాటిపోయిన బడ్జెట్ ఉంటే తప్ప పెంపుని అడగటం లేదు. ప్రస్తుతం అక్కడ మల్టీప్లెక్సులకు 177, ఇతర స్క్రీన్లకు 145, సింగల్ థియేటర్లకు 110 ఉంది. సలార్ స్పెషల్ కేసు కాబట్టి పరిగణనలోకి తీసుకుంటారు.

అయితే వ్యవహారం అంత సులభంగా తేలదు. సినిమాలకు సంబంధించిన విషయాల్లో బాగా నాన్చడం అలవాటుగా పెట్టుకున్న వైసిపి ఇప్పుడు ప్రభాస్ కోసం త్వరగా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. తమిళనాడులో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎందుకంటే అక్కడ బెనిఫిట్ షోలు లేవు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక టికెట్ రేట్ల వ్యవస్థ కట్టుదిట్టం అయిపోయి రేట్లు పెంచడానికి లేకుండా పోయింది. ఇప్పుడు సలార్ ని ప్రత్యేక దృష్టితో చూస్తారని చెప్పడానికి లేదు. పైగా తీసింది శాండల్ వుడ్ ప్రొడ్యూసర్లు. సో జిఓలు వచ్చేదాకా సలార్ నిర్మాతలకు టెన్షన్ తప్పదు మరి.

This post was last modified on November 21, 2023 9:02 pm

Share

Recent Posts

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

37 minutes ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

1 hour ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

1 hour ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

2 hours ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

4 hours ago