నిన్న ఆదికేశవ ట్రైలర్ వచ్చింది. ఆడియన్స్ లో దీని మీద పెద్దగా అంచనాలేం లేవు. పైగా ప్రమోషన్లు ఆలస్యంగా చేయడంతో పాటు హీరోయిన్ శ్రీలీల యాక్టివ్ గా పబ్లిసిటీలో లేకపోవడం మైనస్ అవుతోంది. డేట్లు లేకపోవడం లాంటి కారణాలేమైనా సరే భగవంత్ కేసరిలో ఇన్వాల్వ్ అయినంతగా ఇందులో ఆమె కావడం లేదన్నది వాస్తవం. ఇక వైష్ణవ్ తేజ్ మొదటిసారి ఊర మాస్ ని టచ్ చేసినట్టు క్లారిటీ ఇచ్చేశారు. రెండు నిమిషాల వీడియోలో సగం లవ్ ట్రాక్ చూపించి రెండో సగం ఓ రేంజ్ ఎలివేషన్లతో నింపేశారు. మలయాళం బిజీ ఆర్టిస్టు జీజు జార్జ్ ని విలన్ గా తీసుకొచ్చి రవిశంకర్ గొంతులో భయపెట్టేశారు.
నిర్మాత నాగవంశీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత సరైన మాస్ సినిమా రాలేదన్న లోటుని ఆదికేశవ తీరుస్తుందని చెప్పారు కానీ రివ్యూలు రేటింగ్ అద్భుతంగా వస్తాయని అనుకోవడం లేదని కూడా అన్నారు. బాగానే ఉంది కానీ వైష్ణవ్ కి ఇదింకా నాలుగో సినిమా. సరైన ఫాలోయింగే ఏర్పడలేదు. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత రెండు డిజాస్టర్స్ పడ్డాయి. ఎంత మెగా ఫ్యామిలీ అయినా సరే ఆ కుటుంబం హీరోల ఫ్యాన్స్ అందరూ మొదటి రోజు వైష్ణవ్ తేజ్ కోసం రావడం లేదు. స్వంతంగా మార్కెట్ ఇంకా రాని లేత హీరో మీద ఇంత మాస్ ని ఏ ధైర్యంతో ట్రై చేశారనేది రేపు 24న తేలనుంది.
సరైన మాస్ బొమ్మ వచ్చి నెలలు గడిచిన మాట వాస్తవమే కానీ వైష్ణవ్ ని ఇలాంటి ఎలివేటెడ్ క్యారెక్టర్ లో ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. పైగా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి బోయపాటి శీను, వివి వినాయక్ శైలి అనుసరించిన విషయం కూడా అర్థమైపోతోంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేయడానికి ట్రైలర్ ఇలా కట్ చేశారో లేక ఉన్నదే చూపించారో మొదటి ఆట అయ్యాక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే జివి ప్రకాష్ కుమార్ పాటలు పెద్దగా మేజిక్ చేయలేదు. అంత క్రేజీ కాంబో ఉన్న స్కందనే వర్క్ అవుట్ కానప్పుడు ఆదికేశవ ఏదైనా అద్భుతం చేస్తే మాత్రం మెగాహీరో సుడి తిరిగినట్టే.
This post was last modified on November 21, 2023 10:28 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…