సినిమా వసూళ్లు, ఓవరాల్ రిజల్ట్‌ను సమీక్షలు కొంతమేర ప్రభావితం చేస్తాయడనంలో సందేహం లేదు. ఐతే సినిమా ఎలా ఉందన్నదాన్ని బట్టే రివ్యూలు ఉంటాయి తప్ప.. బాగున్న సినిమాను రివ్యూలు చంపేయలేవు. బాలేని సినిమాను బతికించనూ లేవు. కానీ తమ సినిమా మీద నెగెటివ్ రివ్యూలు ఇచ్చారని సమీక్షకుల మీద సినిమాల బృందాలు విరుచుకుపడే ట్రెండ్ ఈ మధ్య కనిపిస్తోంది.
తెలుగులో ఈ చర్చ చాలాసార్లు జరిగింది కానీ.. మలయాళంలో ఇప్పుడు అదే హాట్ టాపిక్‌గా మారింది. రివ్యూలకు వ్యతిరేకంగా సినిమాల బృందాలు కోర్టులకు వెళ్లడం, కేసులు పెట్టడం వరకు పంచాయితీ ముదిరిపోయింది. తమ సినిమా వసూళ్లు తగ్గడానికి సమీక్షలే కారణం అంటూ తమన్నా మలయాళంలో నటించిన ఓ సినిమాకు సంబంధించి దానికి చిత్ర బృందం కేసులు పెట్టడం సంచలనం రేపింది. అలాగే తమ సినిమాకు రివ్యూలు రాకుండా చూడాలని ముందే ఒక టీం కోర్టుకెక్కింది.
దీని మీద కేరళలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఐతే ఇటీవలే మమ్ముట్టి నటించిన ‘కన్నూర్ స్క్వాడ్’కు రివ్యూలు బాగా ప్లస్ అయ్యాయి. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద హిట్టయింది. ఇంతలో మమ్ముట్టి జ్యోతికతో కలిసి నటించిన మరో సినిమా ‘కాదల్ ద కోర్’ను రిలీజ్‌కు రెడీ చేశాడు. దీని ప్రమోషన్లలో భాగంగా ఆయన ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులు ‘రివ్యూ బాంబింగ్’ గురించి అడిగారు. దానికాయన పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు.
ఒక సినిమా ఫలితం పూర్తిగా రివ్యూల మీద ఆధారపడి ఉంటుందని తాను నమ్మనని మమ్ముట్టి అన్నారు. ప్రేక్షకులైనా, సమీక్షకులైనా తమ అభిప్రాయాన్ని చెప్పడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని.. ఇది అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా తమ అభిప్రాయం చెప్పే హక్కు కలిగి ఉంటారని ఆయనన్నారు. కాకపోతే వేరే ప్రభావాలకు లోను కాకుండా.. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పాలని.. నిర్మాణాత్మకంగా సినిమాను విశ్లేషించాలని ఆయన కోరారు. మమ్ముట్టి వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on November 21, 2023 9:38 am
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…