తొలి చిత్రం ఉప్పెనతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు ఆ తర్వాత టైం అట్టే కలిసి రాలేదు. రెండో సినిమా కొండపొలం మంచి కాన్సెప్ట్ తో వచ్చినా ఆదరణకు నోచుకోలేదు. తర్వాత రంగ రంగ వైభవంగా చేదు ఫలితాన్నే ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఆశలన్నీ ఆదికేశవ మీద పెట్టుకున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ భాగస్వామ్యంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ శ్రీలీల మరో ప్రధాన ఆకర్షణ. అనివార్య కారణాల వల్ల మొన్న వాయిదా పడిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ ఎఎంబి మల్టీప్లెక్స్ లో నిర్వహించారు.
బాలు(వైష్ణవ్ తేజ్)ది జాలిగా గడిచిపోయే జీవితం. చక్కని అమ్మానాన్న, ఎంజాయ్ చేయడానికి స్నేహితులు, చీకు చింత లేని కుటుంబం ఇలా హ్యాపీగా ఉంటున్న టైంలో ఓ అమ్మాయి(శ్రీలీల) పరిచయమవుతుంది. ఆమె లోకంగా తిరుగుతూ ప్రేమిస్తూ వెంటపడతాడు. అయితే కొన్ని అనూహ్య సంఘటనల తర్వాత బాలు ఒక ఊరికి వెళ్తాడు. పది తలల రావణుడి (జీజు జార్జ్) మించిన దుర్మార్గుడితో తలపడాల్సి వస్తుంది. బాలులో ఇంకో రూపం రుద్రకాళేశ్వరరెడ్డి(వైష్ణవ్ తేజ్)బయటికి వస్తాడు. ఇంతకీ ఈ ఇద్దరూ ఒకటేనా లేక ఏదైనా ఊహించని మలుపులున్నాయా తెరమీదే చూడాలి.
దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కమర్షియల్ ఫార్ములానే తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా నడిపించేసి వివి వినాయక్ బన్నీ స్టైల్ లో ఒక గ్రామం, దానికో సమస్య, ఓ గుడి, భయంకరమైన విలన్ ఇలా సెట్ చేసుకున్నాడు. కథను చెప్పినట్టే అనిపించినా ఏదో ట్విస్టులనైతే దాచి పెట్టారు. వైష్ణవ్ విజువల్స్ ఊర మాస్ తో ఉన్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టే ఉంది. శ్రీలీలకు మరోసారి గ్లామర్ ఓరియెంటెడ్ పాత్ర దక్కింది, జీజూ జార్జ్ ఫ్రెష్ గా అనిపిస్తున్నాడు. క్యాస్టింగ్, ప్రొడక్షన్ అన్నీ గ్రాండ్ గా కనిపిస్తున్న ఆదికేశవ ఏ మేరకు మెప్పిస్తాడో నవంబర్ 24న థియేటర్లలో తేలిపోనుంది.
This post was last modified on November 20, 2023 6:43 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు శనివారం (మార్చి 15) మరిచిపోలేని రోజు. ఎందుకంటే… సరిగ్గా 47 ఏళ్ల…
ఏపీ డిప్యూటీ సిఎంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి చేయాల్సినవి కాకుండా భవిష్యత్తులో…
బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.…
మా నాన్నకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం లభిస్తుంది? అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ మర్రెడ్డి…
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…
నిజమే… ఈ విషయం విన్నంతనే.. ఈ సోకాల్డ్ ఆదునిక జనం నిత్యం పరితపిస్తున్న పోటీ… ఇద్దరు ముక్కు పచ్చలారని పిల్లల…