నిన్నట్నుంచి కోలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. సీనియర్ నటుడు, విలన్ పాత్రలకు పెట్టింది పేరైన మన్సూర్ అలీ ఖాన్.. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ‘లియో’ సినిమాలో త్రిష ఉందంటే.. తాను ఎంతో ఊహించుకున్నానని.. ఎన్నో సినిమాల్లో రేప్ సీన్లు చేశాం కాబట్టి, ఈ చిత్రంలో కూడా త్రిషతో రేప్ సీన్ ఉంటుంది కదా అని ఆశపడ్డానని.. కానీ తనకు ఆ అవకాశం దక్కలేదని అతను ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
ఇంతకుముందే ఒక వేడుకలో ఈ సినిమాలో త్రిషతో తనకు కాంబినేషన్ సీన్లు లేకపోవడంపై బాధ పడుతూ.. కనీసం మడోన్నా పాపతో అయినా సీన్లు పెట్టారు కదా అని సంతోషించానని.. కానీ ఆమెకు అన్న పాత్రను తనకిచ్చారని వాపోయాడు. ఆ వ్యాఖ్యలు పబ్లిక్ మీటింగ్‌లో, ‘లియో’ టీం అందరి ముందూ చేయడం గమనార్హం. ఐతే అప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. తాజాగా అతను చేసిన ‘రేప్’ కామెంట్స్ మాత్రం తీవ్ర దుమారం రేపాయి.
త్రిష, ‘లియో’ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సహా పలువురు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖండనలు ఇచ్చారు. మహిళల మీద లైంగిక వేధింపులు, అభ్యంతరకర వ్యాఖ్యల విషయమై సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో పోరాడుతున్న గాయని చిన్మయి సైతం ఈ టాపిక్ మీద వరుసగా ట్వీట్లు వేస్తోంది. ఆమె ఈ ఒక్క ఉదంతాన్నే కాక.. వేరే మేల్ సెలబ్రెటీలు వివిధ సందర్భాల్లో మహిళల మీద చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ పోస్టులు పెడుతోంది.
‘కిక్’ శ్యామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తొలి చిత్ర కథానాయికలు జ్యోతిక, సిమ్రాన్‌లను ఉద్దేశించి గుర్రాలు అని వ్యాఖ్యానించాడు. దాన్ని ఆమె తప్పుబట్టింది. ఇంకా మరి కొన్ని వ్యాఖ్యలపై స్పందించింది. ఐతే అవకాశం దొరికింది కదా అని చిన్మయి దూరిపోతోందంటూ ఆమెతో నెటిజన్లు యుద్ధాలకు దిగుతున్నారు. అజిత్ ఓ సినిమాలో భాగంగా చెప్పిన డైలాగ్‌ను చూపించి ఇది తప్పుగా అనిపించలేదా అని ఒకరంటే.. విజయ్ ఒక వేడుకలో అనుష్కను ఉద్దేశించి చెప్పిన మాటలను మరొకరు ప్రస్తావించారు. అందుకు లాజిక్‌తో బదులిస్తోంది చిన్మయి. మొత్తానికి ఈ టాపిక్ సోషల్ మీడియాను ఊపేస్తుండగా.. నిన్నట్నుంచి నెటిజన్లతో చిన్మయి అలుపెరగకుండా పోరాటం చేస్తోంది.
This post was last modified on November 19, 2023 7:05 pm
ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న పైరసీ గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు కానీ నిన్నా మొన్నటిదాకా ఇవి…
'ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు' అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి…
ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది.…
గత ఏడాది భారతీయుడు 2 రిలీజైనప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్ లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఐ,…
ఏదో క్యాస్టింగ్ పెద్దగా లేని సినిమా ల్యాబ్ లో మగ్గుతుందంటే సహజం అనుకోవచ్చు. కానీ పేరున్న హీరో, ఇమేజ్ ఉన్న…
అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే…