నిన్న విడుదలైన మంగళవారం థియేటర్ల ఆక్యుపెన్సీలో క్రమంగా మెరుగుదల కనిపిస్తోంది. టాక్ ప్లస్ రివ్యూల ప్రభావం ప్రేక్షకులను ఓసారి చూడొచ్చనే దిశగా తీసుకెళ్తోంది. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలో దిగిన ఈ విలేజ్ థ్రిల్లర్ మొదటి రోజు రెండు కోట్లకు పైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఖచ్చితమైన లెక్కలు వీకెండయ్యాక బయటికి వస్తాయి. ఇలాంటి హిట్ మూవీస్ కి మొదటి ఆదివారం చాలా కీలకం అవుతుంది. సెలవు రోజు కాబట్టి వీలైనంత ఎక్కువ వచ్చే అవకాశం ఈ ఒక్క రోజు ఉంటుంది. కానీ మంగళవారంకు అమంగళం అనిపించే అడ్డంకి రేపు ఎదురు కానుంది.
ఇండియా ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో జనాలు టికెట్లు కొని సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. మ్యాచ్ మధ్యాన్నం రెండు గంటలకే అయినప్పటికీ పబ్లిక్ మూడ్ ఉదయం నుంచే క్రికెట్ లోకి వెళ్ళిపోతుంది. చాలా చోట్ల స్టేడియంలు, మైదానాలు, విశాలమైన స్థలాలున్న రెస్టారెంట్లు పెద్ద స్క్రీన్లు కట్టి ఫ్యాన్స్ కి ఉచితంగా ఆటను చూసే ఏర్పాట్లు చేస్తున్నాయి. మొన్న సెమి ఫైనల్ ఇదే తరహాలో వైజాగ్, కడప లాంటి ప్రాంతాల్లో తెరలు కడితే వేలాదిగా క్రికెట్ లవర్స్ తరలి వచ్చి సందడి చేశారు. వేలు ఖర్చు పెట్టినా దొరకని ఎంజాయ్ మెంటది.
సో మంగళవారం ఈ సవాల్ ని కాచుకోవడం చాలా కష్టం. తిరిగి సోమవారం రెగ్యులర్ డ్రాప్ ఎలాగూ ఉంటుంది. మళ్ళీ పికప్ కావాలంటే ఇంకో వీకెండ్ దాకా ఎదురు చూడాలి. 24న ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ రిలీజవుతున్నాయి. టాక్ బాగుంటే ఆడియన్స్ వీటివైపు టర్న్ అవుతారు. లేదూ అంటే మంగళవారంకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ పది రోజులు దాటిందంటే మాత్రం డిసెంబర్ 1 అనిమల్ వచ్చే నాటికి స్క్రీన్లు గణనీయంగా తగ్గిపోతాయి. టైగర్ 3నే క్రికెట్ దెబ్బకు కలెక్షన్ల కోత చవి చూడాల్సి వచ్చింది. అలాంటిది మంగళవారం కనక మంచి ఫిగర్లు నమోదు చేస్తే నిజంగా సంచలనమే అవుతుంది
This post was last modified on November 18, 2023 4:31 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…