జూనియర్ ఎన్టీఆర్ త్వరలో వార్ 2తో బాలీవుడ్ డెబ్యూ చేయబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ భారీ మల్టీ స్టారర్ లో భాగం పంచుకోబోతున్న తారక్ ఎంట్రీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన టైగర్ 3 క్లైమాక్స్ లో ఈ పాత్ర గురించి చిన్న ఎలివేషన్ తో కూడిన హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెగటివ్ టచ్ ఉన్నప్పటికీ హృతిక్ ని ఛాలెంజ్ విసిరే సమాంతర హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ రేంజ్ లో డిజైన్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. తాజాగా యంగ్ టైగర్ సరసన హీరోయిన్ ని ఎంపిక చేసినట్టు ముంబై అప్డేట్.
అమ్మడి పేరు శార్వరి వాఘ్. బంటీ ఔర్ బబ్లీ 2తో తెరంగేట్రం చేసి అదే ఏడాది స్టార్ డెబ్యూ అఫ్ ది ఇయర్ గా ఐఫా అవార్డు, ఫిలిం ఫేర్ పురస్కారం అందుకుంది. మహారాజా షూటింగ్ పూర్తి చేసుకోగా వేదా నిర్మాణంలో ఉంది. వెబ్ సిరీస్ ది ఫర్గెటన్ ఆర్మీ ఆజాదీ కె లియేలో ప్రధాన పాత్ర పోషించింది. అవకాశాలు వస్తున్నా తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. వార్ 2లో ఛాన్స్ ఆఫర్ చేయగానే నో చెప్పడానికి కారణం ఏముంటుంది. అయితే అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కానీ అనౌన్స్ మెంట్ రోజు క్యాస్టింగ్ తో సహా అన్ని వివరాలు బయటికి వస్తాయి.
ప్రస్తుతం దేవరలో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ డిసెంబర్ లేదా జనవరిలో వార్ 2లో సెట్స్ లో అడుగు పెడతాడు. ఆల్రెడీ హీరోలు అవసరం లేని ఎపిసోడ్లను చిత్రీకరిస్తున్న యష్ రాజ్ బృందం 2025 రిపబ్లిక్ డే రోజు విడుదల చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. హృతిక్, తారక్ మధ్య వచ్చే ఫైట్లు, ఇద్దరు కలిసి శత్రువులను ఎదిరించే ఘట్టాలు ఓ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారట. తన పాత్రకు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్న జూనియర్ ఇది పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సెట్లో అడుగు పెట్టాలి. ఈలోగా కొరటాల శివ దేవర 2 స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటాడు. ఇంకో రెండేళ్లు వీటికే సరిపోతుంది.
This post was last modified on November 18, 2023 2:43 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…