నిన్న విడుదలైన మంగళవారం మంచి టాక్ తో దూసుకుపోతోంది. టేకింగ్ లో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆడియన్స్ ని ట్విస్టులతో మెప్పించడంలో సక్సెస్ కావడంతో వసూళ్లు క్రమంగా మెరుగు పడేలా ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్ చాలా కీలకం కానుంది. పోటీలో ఉన్న సప్త సాగరాలు దాటి సైడ్ బి మన ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు లేక నెమ్మదిగా ఉండటంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. స్పార్క్ లైఫ్ ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అయితే మంగళవారంకు ఈ స్థాయి స్పందన రావడంలో సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఒక డిఫరెంట్ సౌండ్ తో గ్రామీణ నేపధ్యానికి తగ్గట్టు సస్పెన్స్ థ్రిల్లర్ కి ఎలాంటి స్కోర్ ఇవ్వాలో దాన్ని మించే ఇచ్చాడు. విరూపాక్షకు సైతం తన కాంట్రిబ్యూషన్ మామూలుది కాదు. అయితే అజనీష్ లో ఇంత సత్తా ఉందని టాలీవుడ్ కు తెలియడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 2009లో కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టిన అజనీష్ కు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన హారర్ క్లాసిక్ రంగితరంగ మొదటి బ్రేక్ ఇచ్చింది. కిరిక్ పార్టీ లాంటి యూత్ ఫుల్ డ్రామాకు అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు. నిఖిల్ చేసిన తెలుగు రీమేక్ కి తనే మ్యూజిక్. తర్వాత సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేతో స్ట్రెయిట్ మూవీ చేశాడు కానీ ఫలితం దక్కలేదు.
మంగళవారంతో మళ్ళీ అజనీష్ చర్చల్లోకి వచ్చాడు. గత కొన్నేళ్లుగా చాలా బ్లాక్ బస్టర్లు కేవలం బీజీఎమ్ వల్లే వాటి స్థాయికి మించి అభిమానులను మెప్పించాయి. ఉదాహరణకు విక్రమ్, జైలర్ లను తీసుకుంటే అనిరుద్ రవిచందర్ ఎలివేట్ చేయకపోతే వాటి ప్రభావం ఖచ్చితంగా తక్కువగా ఉండేది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడుని జిబ్రాన్ పనితనం నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు అజనీష్ ఇస్తున్న అవుట్ ఫుట్ చూస్తుంటే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలు, థ్రిల్లర్లకు మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. మంగళవారం ట్రైలర్ రాగానే తనకు తెలుగు నుంచి అయిదు ఆఫర్లు వచ్చాయట.
This post was last modified on November 18, 2023 12:52 pm
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…