సౌత్ ఇండియాలో గత రెండు దశాబ్దాల్లో వచ్చిన బెస్ట్ డైరెక్టర్లలో ఒకడు గౌతమ్ మీనన్. మణిరత్నం తర్వాత ఆ స్థాయి దర్శకుడిగా ఆయనకు పేరొచ్చింది. కాక్క కాక్క మొదలు ఆయన కెరీర్లో కల్ట్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఐతే ఇంత మంచి దర్శకుడు ప్రొడక్షన్ మొదలుపెట్టి ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడం వల్ల కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. ఆయన సినిమాలు వరుసగా వివాదాల్లో చిక్కుకుని విడుదలకు నోచుకోక ఇబ్బంది పడ్డాయి.
అందులో రెండు మూడు సినిమాలను బయటికి తీసుకొచ్చాడు కానీ.. విక్రమ్ హీరోగా తీసిన ధృవనక్షత్రం మాత్రం ఎన్నో ఏళ్లుగా మరుగున పడి ఉంది. ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మధ్యే ప్రకటించాడు గౌతమ్ మీనన్. మరి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుని ఈ సినిమాను గౌతమ్ ఎలా బయటికి తీసుకురాగలుగుతున్నాడన్నది ఆసక్తికరం. ఈ సీక్రెట్ ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు.
ధృవనక్షత్రం సమస్యకు పూర్తిగా తనదే బాధ్యత అని చెప్పిన గౌతమ్.. తాను డబ్బులు చెల్లించాల్సిన వ్యక్తులు కోర్టుకెక్కడంతో ఈ సినిమా ఇన్నేళ్లు విడుదలకు నోచుకోలేదన్నాడు. వాళ్లు నోటీసులు ఇవ్వడం వల్లే ఓటీటీలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనడానికి ముందుకు రాలేదన్నాడు. ఈ స్థితిలో తనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లినవాళ్లతో ఔట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ ప్రతిపాదన చేశానని.. అప్పుడే వాళ్లకు డబ్బులు వస్తాయని సర్ది చెప్పానని గౌతమ్ తెలిపాడు.
ఐతే తాను డబ్బులు సెటిల్ చేశాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదని వెల్లడించిన గౌతమ్.. రిలీజ్ డేట్ ప్రకటించాకే సినిమాకు సంబంధించిన మూమెంట్ కనిపించిందని చెప్పాడు. అప్పుడే బిజినెస్ వ్యవహారాలు మొదలయ్యాయన్నాడు. ఓటీటీలు ఇది పాత సినిమా అని కొనడానికి ముందుకు రాలేదని.. దీంతో వాటికి షోలు వేసి పూర్తి సినిమా చూపించాల్సి వచ్చిందని.. మామూలుగా అయితే అరగంట చూపించి డీల్ క్లోజ్ చేస్తామని గౌతమ్ తెలిపాడు. ఐతే రావాల్సిన డబ్బులు పూర్తిగా ఇంకా రాలేదని.. అన్ని మార్గాల నుంచి డబ్బులు రాబట్టి సినిమాను అనుకున్న ప్రకారం రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు గౌతమ్ తెలిపాడు.
This post was last modified on November 17, 2023 11:49 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…