ఏజెంట్ డిజాస్టర్ గాయం అభిమానులు మర్చిపోయారేమో కానీ అఖిల్ ఆలోచనల మీద మాత్రం దాని ప్రభావం గట్టిగానే పడింది. రిలీజైన మూడో రోజే ఫలితం చూడలేక దుబాయ్ వెళ్లిపోవడం దగ్గరి నుంచే ఈ అంతర్మథనం మొదలైంది. దానికి తోడు ఓటిటి స్ట్రీమింగ్ సైతం వివాదంలో చిక్కి నెలల తరబడి ఎదురు చూస్తున్నా బయటికి రాకపోవడం పట్ల ఫ్యాన్స్ ఒకరకంగా సంతోషంగానే ఫీలవుతున్నారు. అఖిల్ నెక్స్ట్ చేయబోయే కొత్త సినిమా ఇప్పటిదాకా షురూ కాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి ఖచ్చితంగా ఫలానా టైం, డేట్ చెప్పడం లేదు. దానికి దాదాపు చెక్ పడినట్టే.
యువి క్రియేషన్స్ నిర్మించబోయే అఖిల్ 6 వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అంత టైం ఎందుకంటే స్క్రిప్ట్ విషయంలో ఒకటికి పది జాగ్రత్తలు తీసుకుని ఫైనల్ వెర్షన్ లాక్ చేస్తారట. నాగార్జున నా సామి రంగా, బిగ్ బాస్ 7తో బిజీగా ఉండటంతో జనవరిలో ఓసారి నెరేషన్ విన్నాక లాక్ చేయాలని చూస్తున్నారని వినికిడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వంద కోట్ల బడ్జెట్ తో అఖిల్ కెరీర్ లోనే ఖరీదైన సినిమాగా రూపొందుతోంది. యువి సంస్థలో ఎప్పటి నుంచో అసోసియేట్ గా ఉన్న అనిల్ కుమార్ ఈ ప్యాన్ ఇండియా మూవీతో దర్శకుడిగా డెబ్యూ చేయబోతున్నాడు.
ఒకపక్క చిరంజీవితో విశ్వంభరని రెండు వందల కోట్ల బడ్జెట్ తో సిద్ధం చేస్తున్న యువి ఇంకో పక్క అఖిల్ మీద మరో వంద కోట్ల పెట్టుబడిని రెడీ చేస్తోంది. అనుష్కతో భాగమతి 2 ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తుత్తిదేనని, అసలు కథే రెడీగా లేదని తర్వాత తేలిపోయింది. కెరీర్ మొదలుపెట్టి ఆరేళ్ళు దాటుతున్నా గర్వంగా చెప్పుకునే పెద్ద బ్లాక్ బస్టర్ లేని అఖిల్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదని కష్టపడుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు పర్యవేక్షణ కూడా చేస్తారట. ఇంతకన్నా గుడ్ న్యూస్ ఫ్యాన్స్ కి ఏముంటుంది
This post was last modified on November 17, 2023 11:26 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…