ఆర్ఆర్ఆర్ తర్వాత ఆలస్యం చేయకుండా గేమ్‌ఛేంజర్ సినిమాను మొదలుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దాని తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులైంది. ఆ తర్వాత చాన్నాళ్ల పాటు ఏ అప్‌డేట్ లేదు. చరణ్ 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడని చాన్నాళ్ల ముందే వార్తలు వచ్చాయి.
ఈ మధ్యే రెహమాన్ స్వయంగా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇప్పుడు ఈ సినిమా కథానాయిక విషయంలో ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. జాన్వి కపూర్, కీర్తి సురేష్, రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ ఇలా చాలా పేర్లు వినిపించాయి కానీ.. ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరే.. సాయిపల్లవి. ఎవ్వరి అంచనాలకూ అందని విధంగా చరణ్ సినిమాకు సాయిపల్లవిని కథానాయికగా కన్సిడర్ చేస్తున్నాడట దర్శకుడు బుచ్చిబాబు.
సాయిపల్లవి ఇప్పటిదాకా భారీ కమర్షియల్ సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఎవరితోనూ నటించలేదు. ఆమె గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ పెద్ద స్టార్లు నటించే కమర్షియల్ సినిమాలకు సెట్ కాదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో చరణ్ సినిమాలో సాయిపల్లవి నటిస్తోందంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు.
ఐతే మంచి కథాబలం ఉన్న కథలో కథానాయిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండటంతో సాయిపల్లవిని కన్సిడర్ చేస్తున్నాడట బుచ్చిబాబు. ఆమెతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు. చరణ్ ఇందులో స్పోర్ట్స్ మన్ టర్న్డ్ కోచ్‌గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on November 17, 2023 9:04 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…