అదేంటి నాగచైతన్య డెబ్యూ ఎప్పుడో 2009 జోష్ తో కదా జరిగింది. ఇప్పుడా హీరోయిన్ కి పెళ్లేంటని ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. సీనియర్ కథానాయిక, రెండో తరం టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్లు అందుకున్న రాధ కూతురు కార్తీక చైతుతోనే తెరకు పరిచయమైన సంగతి గుర్తేగా. ఇది ఆశించిన విజయం సాధించకపోయినా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కార్తీకలో గ్లామర్ ఫాక్టర్ తక్కువగా ఉండటంతో పాటు బక్కపలచని దేహం పెద్దగా అవకాశాలు రాకుండా చేసింది. అయినా జూనియర్ ఎన్టీఆర్ దమ్ములో త్రిషతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం విదితమే.
అల్లరి నరేష్ బ్రదర్ అఫ్ బొమ్మాలిలో చేసింది కానీ ఆడలేదు. ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం జీవాతో చేసిన రంగం. ఇన్నేళ్ల తర్వాత కార్తీకకు పెళ్లి కుదిరింది. రోహిత్ మీనన్ ని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పెళ్లి కొడుకుకు సంబంధించిన ఎక్కువ వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు కానీ తర్వాత బయటికి వస్తాయి. అయితే ఇన్ని సంవత్సరాలు కార్తీక ఒంటరిగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తన వేడుక కోసమే రాధ ఇండియాలోనే ఉంటూ పనులు చూసుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా.
హీరోలకు లేట్ మ్యారేజ్ కావడం మాములే కానీ ఇలా హీరోయిన్ కూడా ముప్పై నలభై వయసు చేరాకో లేదా దాటాకో చేసుకోవడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళు కెరీర్ ని పూర్తిగా ఆస్వాదించాకే గృహణి బాధ్యతలు తీసుకోగా మంచి డిమాండ్ ఉన్నప్పుడే కియారా అద్వానీ తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటివాడిగా చేసుకుంది. అయినా ఎవరి నిర్ణయాలు వారివే కానీ సెలబ్రిటీ పెళ్లిల్లంటే సహజంగానే జనంలో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. మంచి పాత్రలు వస్తే త్వరలో రీ ఎంట్రీ ఇస్తానంటున్న కార్తీక భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతుందేమో.
This post was last modified on November 16, 2023 4:23 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…