Movie News

విక్రమ్ సినిమాను కాపాడిన డీల్

ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కినప్పుడు బయటికి రావడం మహా కష్టంగా ఉంటుంది. విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం అలాంటి చిక్కుల్లోనే ఆరేళ్ళ విలువైన కాలాన్ని గడిపేసింది. కేవలం దీని రిలీజ్ కోసమే నటుడిగా మారి డబ్బులు సంపాదిస్తున్నానని నిర్మాత కం దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఎట్టకేలకు నవంబర్ 24న దీని మొదటి భాగం యుద్ధకాండం థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ లాంచ్ చేశారు. ఇంతకీ దీన్ని గట్టెక్కించిన డీల్ కథేంటో ఓ లుక్ వేద్దాం.

ధృవ నక్షత్రం పూర్తిగా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. శత్రువును పట్టుకోవడం కోసం ఒకరితో మరొకరికి సంబంధం లేని ఒక గ్యాంగ్ ఏర్పడటం ఇందులో మెయిన్ పాయింట్. అధిక శాతం షూటింగ్ విదేశాల్లో చేశారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ కాగా జైలర్ కన్నా ముందే  దీంట్లో ఛాన్స్ కొట్టేశాడు విలన్ వినాయకన్. హరీష్ జైరాజ్ సంగీతం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇంత క్వాలిటీ టీమ్ ఉంది కాబట్టి వెండితెరపై ఎలా ఆడినా ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో నెట్ ఫ్లిక్స్ ధృవ నక్షత్రంని 40 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ టాక్.

ఇది చాలా భారీ మొత్తం. ప్యాన్ ఇండియా కాబట్టి థియేట్రికల్ గా వచ్చిన రెవిన్యూతో కలుపుకుని నిర్మాత ఈజీగా గట్టెక్కుతాడు. ఒకవేళ తేడా వస్తే రెండో భాగంతో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చేసి ఆమేరకు బయ్యర్లను ఒప్పించవచ్చు. ఈ రకంగా ధృవ నక్షత్రంకు రూట్ క్లియర్ అయ్యిందన్న మాట. విపరీతమైన జాప్యం జరగడంతో ఆడియన్స్ లో దీని మీద పెద్దగా ఆసక్తి రేగడం లేదు. అందుకే ప్రమోషన్లను వేగవంతం చేసే పనిలో  ఉన్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సమాంతరంగా రిలీజ్ కానుంది. అదే రోజు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ తప్ప టాలీవుడ్ వైపు నుంచి పెద్దగా పోటీ లేదు. 

This post was last modified on November 14, 2023 6:42 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

60 minutes ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago