సడక్-2.. ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అయిన సినిమా. సోషల్ మీడియాలో ఆ సినిమా ప్రకంపనలు రేపింది. కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచింది. కానీ ఇవేవీ కూడా సానుకూల కారణాలతో జరిగినవి కావు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో.. బాలీవుడ్లో నెపోటిజం ప్రతినిధులుగా పేరున్న వాళ్లంతా కలిసి చేసిన సినిమా కావడంతో ఈ సినిమా మీద తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు ప్రేక్షకులు.
దీని ట్రైలర్ లాంచ్ చేస్తే రికార్డు స్థాయిలో డిజ్ లైక్స్ కొట్టి ఒక వరస్ట్ రికార్డు చిత్ర బృందానికి కట్టబెట్టారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కానీ, పాటలు కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమా డిజాస్టర్ కావడం ఖాయమని ముందే అందరూ తేల్చేశారు.
ఇంత నెగెటివిటీ మధ్య రిలీజైన సడక్-2 గురువారం అర్ధరాత్రి 12 గంటలకు హాట్ స్టార్+డిస్నీలో రిలీజైంది. ఆ సినిమా చూసిన వాళ్లందరూ సోషల్ మీడియాలో హాహాకారాలు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి.
90ల్లో సడక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ భట్.. ఇన్నేళ్ల తర్వాత దర్శకత్వం చేస్తుంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశించిన వాళ్లందరూ సినిమా చూసి బెంబేలెత్తిపోయారు. గత కొన్నేళ్లలో బాలీవుడ్లో వచ్చిన వరస్ట్ మూవీస్‌లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు.
మామూలుగా ఎలాంటి సినిమాకైనా ఓ మోస్తరు రేటింగ్ వేస్తాడని పేరున్న క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సింగిల్ స్టార్ ఇచ్చి అన్ బేరబుల్ అని మెసేజ్ పెట్టాడంటే ఈ సినిమా సంగతేంటో చెప్పేయొచ్చు.
మిగతా క్రిటిక్స్ దారుణమైన కామెంట్లు చేశారు. జీరో రేటింగ్స్ ఇచ్చారు. ఈ సినిమా మీద ఉదయం నుంచి ఒకటే జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. ఇందులో సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రలు పోషించారు.
This post was last modified on August 29, 2020 9:25 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…