Movie News

తెలుగులో తేడా తమిళంలో భళా

ఒక భాషలో హిట్ అయిన సినిమా డబ్బింగ్ రూపంలో అదే ఫలితాన్ని తెచ్చుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ మధ్య ఇది మరింత స్పష్టంగా తేటతెల్లమవుతోంది. లారెన్స్ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తమిళనాడులో 25 కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. కానీ ఏపీ తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేక ఎదురీదుతోంది. మనకు కనెక్ట్ అయ్యే అవకాశం లేని కంటెంట్ కావడంతో తెలుగు జనాలు ఏమంత ఆసక్తి చూపించడం లేదు. దీంతో సమానంగా టాక్ తెచ్చుకున్న ‘జపాన్’ ఇదే దారి పట్టగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ మధ్యలో లాభపడటం కనిపిస్తోంది.

ఇదొక్కటే కాదు ఇంకా వేరే ఉదాహరణలు ఉన్నాయి. సెప్టెంబర్ లో వినాయక చవితికి వచ్చిన విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తీరా చూస్తే మన దగ్గర కనీస స్థాయిలో ఆడలేదు. ‘పొన్నియిన్ సెల్వన్’ని వాళ్ళు నెత్తినబెట్టుకుంటే మనకు మణిరత్నం టేకింగ్ అర్థం కాలేదు. విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 1’ ఫలితమూ ఇంతే. వెట్రిమారన్ టేకింగ్ లోని గొప్పదనాన్ని మనోళ్లు రిసీవ్ చేసుకోలేకపోయారు. రివ్యూలు, టాక్ బాగున్నప్పటికీ అది గ్రౌండ్ లెవల్ లో క్యాష్ కాలేదు. కన్నడ మూవీ ‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’ కూడా ఇదే రిపీట్ అయ్యింది.

ఒకప్పుడు శంకర్, గౌతమ్ మీనన్, మణిరత్నం డబ్బింగ్ సినిమాలకు ఒకటే స్పందన వచ్చేది కానీ మారుతున్న పరిస్థితులు అభిరుచులకు అనుగుణుంగా ఇప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో హిట్టు కొట్టిందని సంబర పడి హక్కులు కొనేసుకుంటే తర్వాత అయ్యో అనుకోవాల్సి పరిస్థితి తలెత్తుతోంది. కెజిఎఫ్, విక్రమ్, లియో లాంటివి మినహాయింపుగా చెప్పుకోవచ్చు కానీ ప్రతిసారి అలాంటి గ్రాండియర్లే రావుగా.  ప్రమోషన్లు, పబ్లిసిటీ హంగామా చేసినా మన నేటివిటీకి దగ్గరగా ఉంటేనే కొత్త తరం అంగీకరిస్తోంది. లేదంటే ఎంత పెద్ద బ్యానర్ ఉన్నా డిజాస్టర్లు తప్పవు. 

This post was last modified on November 13, 2023 7:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago