ముందు చెప్పిన డేట్ కి కనక గ్యాంగ్స్ అఫ్ గోదావరిని రిలీజ్ చేయకపోతే ప్రమోషన్లలో కనిపించనని హీరో విశ్వక్ సేన్ ఆ మధ్య శపథం చేసిన సంగతి గుర్తే. నిర్మాత నాగవంశీ అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాయిదా పడుతుందనే ఆందోళనలో అలా అన్నాడు తప్పించి అంతకు మించి ఏం లేదనే రీతిలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ లో డేట్ ప్రస్తావన లేకపోవడంతో మార్పు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 8కి బదులు సలార్ వచ్చిన వారం తర్వాత 29 రిలీజ్ చేద్దామని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇక్కడ విశ్వక్ కన్విన్స్ కావడానికి బోలెడు రీజన్స్ ఉన్నాయి. సలార్ వల్ల థియేటర్లు దొరకవనే టెన్షన్ అక్కర్లేదు. తన సినిమా నిర్మిస్తున్న సితారనే గుంటూరు కారం ప్రొడ్యూసర్లు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అవసరమైన స్క్రీన్లు వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ సలార్ బ్లాక్ బస్టర్ అయినా సరే వారాల తరబడి తెలుగు రాష్ట్రాల జనం మొత్తం దాన్నే చూస్తూ ఉండరుగా. కొత్త వాటికి స్పేస్ వస్తుంది. అందులోనూ గ్యాంగ్స్ అఫ్ గోదావరి టీజర్, పాటల వల్ల మాస్ లో బజ్ ఉంది. కంటెంట్ కనక క్లిక్ అయితే ఖచ్చితంగా ఓపెనింగ్స్ తో పాటు వసూళ్లు బాగుంటాయి.
ఆపై ఎలాగూ సంక్రాంతి వరకు రెండు వారాల ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది కనక ఒకటి రెండు రోజులు టాక్ ఆలస్యంగా వెళ్లినా సరైన ప్రమోషన్లతో పది రోజుల పాటు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. ఇదంతా ఆలోచించే విశ్వక్ సేన్ నిర్ణయాన్ని నాగవంశీకి వదిలేసినట్టు వినికిడి. ఇది మంచిదే. హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్, ఆపరేషన్ వాలెంటైన్ లతో తలపడటం కంటే ఇలా సోలోగా రావడం అన్ని విధాలా క్షేమం. అయినా పెద్ద హిట్టు లేక చాలా కాలంగా వెయిటింగ్ లో ఉన్న విశ్వక్ సేన్ వీలైనంత పంతాలకు పోకుండా ఉండటం మంచిది. ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక అఫీషియల్ ప్రకటన వస్తుంది